114
తమ్ముడు పవన్ పార్టీకి అన్న చిరంజీవి వితరణ చర్చనీయాంశంగా మారింది. అయిదు కోట్ల రూపాయల చెక్కు పార్టీ ఫండుగా అన్న చిరంజీవి పవన్ కు ఆంజనేయస్వామి సాక్షిగా అందించారు. అంతే కాదు ఇప్పటి వరకు పవన్ పార్టీ జనసేనకు కనీసం మద్దతు ప్రకటిస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా వెల్లడించలేదు. పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్ మాత్రమే తంటాలు పడుతూ వచ్చారు. దీన్నిబట్టి చిరంజీవి సహా మెగా కుటుంబం జనసేనకు దూరమని అంతా భావించారు. కానీ తాజా పరిణామం ఆసక్తికర ఆలోచనలకు ఊతంగా నిలుస్తోంది. జనసేన కోసం చిరంజీవి ఈ భారీ వితరణ ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా వున్నారు. కూటమి తరపున ప్రచారం చేయక పోయినా తమ్ముడు పవన్ కోసం చిరంజీవి పిఠాపురంలో అడుగు పెడతారని గంపెడాశతో వున్నారు.