106
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ నేతలు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. డ్రైవర్ మెడకు ఉరితాడు బిగించే క్రిమినల్ చట్టం 106(1)(2)ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కొండపల్లి పారిశ్రామిక వాడలోని ఐడిఎలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి NCH శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి M. మహేష్, ఇతర కార్మికులు పాల్గొన్నారు.