ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్, భట్టి ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సిఎం, డిప్యూటీ సిఎంలు కలవనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి విన్నవించడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్ట్ లకు నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తో పాటు ఇతర ప్రాజెక్ట్ లకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా విడుదల చేయాలని మోదీని… రేవంత్, భట్టి కోరే అవకాశముంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అమలు కావాల్సిన హామీలు, ఐటిఐఆర్ ప్రాజెక్ట్ పై మోదీతో… రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చర్చించనున్నారు.
నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం, డిప్యూటీ సీఎం…
88
previous post