వైఎస్ఆర్ ఆసరా పథకం (YSR Asara Scheme) ద్వారా రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా లబ్ది పొందారని సీఎం జగన్ (CM Jagan) అన్నారు. బస్సు యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలోని ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్షత లేదన్నారు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలతో ఎర్రగుంట్లలో 93 శాతం మంది లబ్ది పొందారని వివరించారు. ఏ పార్టీ అని చూడకుండా పథకాలు అందిస్తున్నామన్నారు. నా కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు.. నా కంటే ముందు ఓ 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేశారని చంద్రబాబును ఉద్దేశిస్తూ అన్నారు. వయస్సులో నేను చాలా చిన్నోడినని.. ఇంత చిన్నోడు చేసిన పనులు 14 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఏనాడైనా చేశాడా అని ప్రశ్నించారు. వయస్సులో చిన్నోడినైనా రాష్ట్రం కోసం పని చేశానని జగన్ తెలిపారు.
ఇది చదవండి: కేటీఆర్‌పై కేసు నమోదు..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి