Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Telangana కేటీఆర్‌పై కేసు నమోదు..

కేటీఆర్‌పై కేసు నమోదు..

by Rama
KTR

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR)పై కేసు నమోదు అయింది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy)పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ పీఎస్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కొందరు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద రూ.2500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి పంపించాడని కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని సీరియస్ అయ్యారు. వెంటనే అదుపులోకి తీసుకొని విచారించాలని కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు.

ఇది చదవండి: నేడు కర్నూలులోకి ప్రవేశించనున్న మేము సిద్దం బస్సు యాత్ర..


ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.
తెలంగాణలో ఆయుష్ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆయుర్వేద, హోమియోపతి, …
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ విజయాన్ని ఏ శక్తీ ఆపలేదని …
తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు, వ్యవసాయ వాణిజ్యం, పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: