జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కావలిలో ఆయన మాట్లాడుతూ.. ఒక జాతీయ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది.. మరో జాతీయ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఇలా రాష్ట్రానికి మోసం చేసిన పార్టీలన్నీ చంద్రబాబు పక్షమేనని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సినిమా విలన్ క్యారెక్టర్లన్నీ కలిపితే చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మూడు సార్లు రంగురంగుల మేనిఫెస్టో చూపించారు.. కనీసం ఒక్కసారైనా మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను అమలు చేశారా అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోరన్నారు. గత ఎన్నికల టీడీపీ మేనిఫెస్టో చూపించే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీలపై సీఎం జగన్ ఫైర్…
77
previous post