మేమంతా సిద్ధం (Memanthaa Siddam) :
సీఎం జగన్ మేమంతా సిద్ధం (Memanthaa Siddam) యాత్రకు జేజేలు, రెండవ రోజు యాత్రకు భారీ స్పందన
సీఎం జగన్ మేమంతా సిద్ధం (Memanthaa Siddam) యాత్రకు జనాలు జేజేలు కొడుతూ, రెండవ రోజు యాత్రకు భారీ స్పందన లభించింది. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర అయితే, మోసాల చంద్రబాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, సీఎం జగన్ పిలుపునిచ్చారు. నారా వారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో చంద్రబాబు, అబద్ధాలు, మోసాలు చూశాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి.. నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతాం.
ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి. ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ ఎన్నికలు మోసాల బాబుకు చివరి ఎన్నికలు కావాలి. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమం చేసి చూపించాం. ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం. లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రుపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.
మేమంతా సిద్ధం (Memanthaa Siddam) : సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్…
నంద్యాల అనంతమైన జనసముద్రంలా కనిపిస్తుంది. సంక్షేమాన్ని ఇంటి ఇంటి అభివృద్ధిని కాపాడుకునేందుకు, ప్రజా సైన్యం గతంలో బాబు మోసాల పాలన చూసిన తర్వత, అందుకు భిన్నంగా ఐదేళ్లు మంచి చేసిన ప్రభుత్వం చూసిన తర్వాత, ఒక రావణుడు, నరకాసురుడు, దుర్యోదనుడు కలిసి వస్తున్నారు. నారా వారి పాలన మళ్లి తీసుకువస్తామని చెబితే ఒప్పుకోమని చెప్పేందుకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు సిద్ధంగా ఉన్నారు.
ప్రజల రాజ్యాన్ని, రైతుల రాజ్యాన్ని, అవ్వతాతల సంక్షేమ రాజ్యాన్ని, మహిళల రాజ్యాన్ని కులగొట్టేందుకు వారందరు కలసి ఎదురు చూస్తున్నారు. ఇటువైపు చూస్తే జగన్ ఒక్కడు… అటువైపు చూస్తే చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, పరోక్షంగా కాంగ్రెస్, పచ్చమీడియా. వీళ్లందరు తోడేళ్లలా మీ బిడ్డను ఎదుర్కొనేందుకు వస్తున్నారు. వీళ్లని ఎదుర్కునేందుకు మీరంతా సిద్ధమే
పేదలను మళ్లీ చీకట్లోకి తీసుకువెళ్లేందుకు పొత్తులు, తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి- సీఎం జగన్
పేదవాడి భవిష్యత్తుని వెలుగు నుంచి చీకటికి తీసుకుపోయేందుకు పొత్తులమారి, జిత్తులమారి పార్టీలు కుట్రలు చేస్తున్నాయి, ఎదుర్కునేందుకు మీరంతా సిద్ధమా! మరోసాని మీరంతా ఒట్లు వేసి 175/175 ఎమ్మెల్యేలు, 25/25 ఎంపీ స్థానాలు సాధించి డబులు సెంచరీ సర్కార్ ను స్థాపించేందుకు సిద్ధమా! ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకనే ఎన్నిక కాదు, ఈ ఎన్నికల్లో ఒటు వేసి ఐదేళ్ల ఇంటి ఇంటికి జరిగిన ప్రగతిని వచ్చే ఐదేళ్లలో కొనసాగించాలా లేక చంద్రబాబుకు ఒటువేసి పది సంవత్సరాలు వెనక్కి వెళ్లాలా అని ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి
చంద్రబాబుకి ఒటు వేస్తే పదేళ్ల వెనక్కి వెళ్లినట్లే.. బాబు వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్
నారా వారిపాలన తీసుకువస్తామంటున్నారు.. గత ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఒటు వేసిన వారు కూడా ఆలోచన చేయండి. ఈ ఎన్నికల్లో వేసే ఒటు, మన తలరాతలు మనమే రాసుకునే ఒటు. ప్రతి ఒక్కరిని అడుగుతున్న, మీకు, మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచన చేయండి. ఇంటికి వెళ్లి మీ కుటుంబంతో కలిసి ఆలోచన చేయండి. మంచి చేసే మనసు ఏ పాలకుడికి ఉందో ఆలోచన చేయండి. సరైన నిర్ణయం తీసుకోండి.
ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర.. బాబుకు చివరివి
ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్తు నిర్ణయమవుతుందని తెలుసుకోండి. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు జైత్ర యాత్ర. మోసాలు బాబుకు చివరి ఎన్నికలు కావాలని పిలుపునిస్తున్న. ఏ ఒక్క ప్రభుత్వం కూడా తీసుకురాని మంచి మార్పులు మీ కళ్ల ఎదుటే, మీ ఇంటి బయటే కనిపిస్తుంది. పౌర సేవల్లో ఎది కావాలన్న తలుపు తట్టి అందిస్తా ఉన్న పాలన ఎప్పుడు వచ్చిందనే ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వతే నేరుగా అక్కచెల్లమ్మల ఖాతాలో రూ 2.70 లక్షల కోట్లు జమ చేశాం, అక్కచెల్లమ్మల ఫోన్లలోనే దిశా యాప్, ప్రతి గ్రామంలో మహిళా పోలీసు కనిపిస్తా ఉంది, ఇవన్నీ మీ బిడ్డ పాలనలోనే జరిగాయని గమనించండి.
మీ బిడ్డకి కావలసింది ప్రచారాలు, అవార్డులు కాదు, పేదల గుండెల్లో సంతోషం
మీ బిడ్డ చేసినదానిలో చంద్రబాబు 10 శాతం చేసనా ఈపాటికి ప్రచారంతో హోరెక్కించేవారు. ఈ పనులు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు, మీ పిల్లల చదువుల్ని ఎలా మర్చామో కూడా చూడండి, ఇంతకముందు ఎవరు కూడా పిల్లల్ని పట్టించుకోలేదు, కారణం పిల్లలకి ఒటు హక్కు లేదు కాబట్టి, కానీ మీ బిడ్డ పిల్లలే రేపటి తరం, ఆ పిల్లలు బాగుంటేనే పేదవాడి బతుకు బాగుపడుతుందని, వారి కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి మీ బిడ్డ మాత్రమే వైద్య, ఆరోగ్య రంగాన్ని చూడండి, నాడు- నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రలు రూపురేఖలు మారుతున్నాయి. ఇంతకు ముందు ఆసుపత్రలకు వెళ్లతే మందులు ఉండేవి కాదు, డాక్టర్లు ఉండేవారు కాదు. కానీ నేడు 54వేల మందిని రీక్రూట్ చేసుకుని సేవలు అందిస్తున్నాం. మెడికల్ కాలేజీలు కట్టాం.
మన నంద్యాలలోనే ఒకటి మేమంతా సిద్ధం (Memanthaa Siddam) యాత్రలో కనిపిస్తుంది. పేదవాడు అప్పులుపాలు కాకూడదని పేదవాడికి ఆరోగ్యశ్రీ మీద రూ. 25లక్షలు వైద్యం ఉచితంగా అందించే విధంగా మనం మార్చాము. రోగికి నెలకు రూ.5000 ఆరోగ్య ఆసరా అందిస్తున్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే రైతన్నలను తోడుగా ఉండు ఆదుకున్నది మీ బిడ్డ పాలనలోనే. పాడి రైతుల కోసం ఆమూల్ తీసుకువచ్చి ప్రతి లీటర్ కు రూ. 10 నుంచి రూ. 30 అందిస్తా ఉన్నాం. 19 లక్షల ఎకరాలకు సర్వహక్కులు రైతన్నలకు కల్పిస్తున్నాం. మొటమొదటిసారి పేదవాడికి తొడుగా ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. నామినేడ్ పదవులు ఇస్తు ఏకంగా చట్టం చేస్తు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీలు బాగుండాలని 50శాతం రిజర్వ్ చేస్తు చట్టం చేశాం.
పేదరికానికి కులం ఉండదు అని చెప్పి అగ్రవర్ణాల పేదలకు కూడా మంచి జరిగింది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. ఈ వ్యవస్థలు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. మీ బిడ్డ ఐదేళ్లలో ఇంత చేయగలిగాడు, మరి 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అని ప్రశ్నిస్తున్నా, మీ బిడ్డ తీసుకువచ్చిన మరోక గొప్ప మార్పు విశ్వనీయత అనే పదానికి అర్ధం తీసుకురావటమని చెబుతున్న.
ఇది చదవండి : ప్రారంభమైన రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర..
ఇంతకు ముందు రంగు రంగులు మెనిఫెస్టోలు కనిపించేవి, ఎన్నికలు అవ్వగానే చెత్తబుట్టలో పడేసే పరిస్థితి నుంచి ఎన్నికల మెనిఫెస్టోని భగవద్గీతగా, ఖురాన్ గా, బైబీల్ గా భావించి 99శాతం అమలు చేసి, ఇంటి ఇంటికి తిరిగి చూపించి ఆశీస్సులు తీసుకుంటున్న పార్టీ మీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 58 నెలల్లో మీ బిడ్డ చేసిన మంచి కనీసం 10శాతమైన చేసి ఉంటే, ఇదే చంద్రబాబు & కో, ఇతరపార్టీల్లో పెట్టుకున్న చంద్రబాబు మనుషులు, వీరంతా ఎమనేవారో తెలుసా.. మా బాబుకు 10 నోబులు బహుమతులు ఇవ్వాలని, వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ సన్మానించాలని ప్రచారం చేసుకునేవాళ్లు కానీ మీ బిడ్డకు దక్కిన బహుమతి ఎంటో తెలుసా! పేదల గుండెల్లో సంతోషం, వారి మనసుల్లో ఆత్మావిశ్వాసం, అక్కచెల్లమ్మల సాధికారత, అవ్వతాతల మోహాల్లో చిరునవ్వులు.
ఇవీ జగన్ కు కావాల్సీ ఆవార్డులు, రివార్డలు. దీనికోసమే నేను ఆరాటపడుతున్న ఇదే చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమైనా గుర్తువస్తుందా? 14ఏళ్లు పరిపాలించిన వ్యక్తి చేసిన మంచి ఒక్కటి కూడా గుర్తుకురాదు.రైతులకు బాబు పేరు చెబితే వ్యవసాయం దంగా అన్న బాబు గుర్తుకు వస్తాడు, రుణమాఫీ అని ముంచేసిన బాబు గుర్తు వస్తాడు, బాబు వస్తే కరువు వస్తుందనే నానుడి గుర్తువస్తుంది. ఇదే చంద్రబాబు పేరు చెబితే 2014లో పంపించిన ముఖ్యమైన హామీల్లో ఒకటి రైతుల రుణమాఫీ పై సంతకం చేస్తా అన్నాడు, చేశాడా? రెండవది పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తామని చెప్పాడు, చేశాడా? ఆడుబిడ్డ పుట్టిన వెంటనే రూ. 25వేల బ్యాంకులో డిపాజిట్ చేస్తాని అన్నాడు, చేశాడా? నిరుద్యోగ భృత్తి ఇస్తానని అన్నాడు.. చేశాడా? సింగపూర్ కి మించి చేస్తా అన్నాడు.. చేశాడా?
ప్రత్యేక హోదా ఇచ్చారా? ఏ ఒక్క హామీ నేరవేర్చకపోయారు? సూపర్ సీక్స్ అంటూ మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారు. కొత్తకొత్త మోసాలతో వీరి ముగ్గురు వస్తున్నారు? రాజకీయాల్లో ఉన్నప్పుడు నాయకుడంటే ఎలా ఉండాలంటే, నాయకుడిని చూపించి కాలర్ ఎగరేసుకునేలా ఉండాలి. విలువలకు, విశ్వనీయతకు అర్థంలా ఉండాలి. కూర్చి కోసం ఎదైనా చేసే ఆద్వానపాలకులు మనకు కావాలా?
అబద్ధాలని, కుట్రలని నమ్ముకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. మరో ధర్మ, అధర్మ యుద్ధానికి రెడీ అవ్వాల్సిన టైం వచ్చింది. ఈ యుద్ధానికి మీరు సిద్ధమా! జెండాలు జత కట్టిన వారికి, జనం గుండెల్లో గుడి కట్టిన మనకు జరగబోయే ఈ ఎన్నికల్లో, ఎవరు ఎం చేశారో చెప్పేందుకు, ఇంటి ఇంటికి వెళ్లి ఒటు అడిగేందుకు మీరంతా సిద్ధమా! బాబు లాగా మనకు మీడియా సప్పోర్టు లేదు, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు మనకు ఛానల్ ఒనర్, వారి చీకటి యుద్ధాన్ని ఎదుర్కునేందుకు సిద్ధమా.
Follow us on : Google Newsమరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి