64
ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుటకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయుటపై దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఆదివారం MCR HRD ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ సందర్శించారు. ఈ నేపథ్యంలో MCR HRD ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ DG డాక్టర్ శశాంక్ గోయల్ పుస్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. సంస్థ కార్యకలాపాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శశాంక్ గోయల్ ఆయనకు వివరించారు. అనంతరం ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను తెలుసుకున్నారు. సంస్థలోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో పర్యటించి పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభిృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు.