104
అభయహస్తం ఫైల్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు. త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములన్నారు. పోరాటాలు, త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు. గత ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోలేదన్నారు. పదేళ్లు ప్రజలు బాధలను మౌనంగా భరించారన్నారు. ప్రజాభవన్ దగ్గర కంచెను బద్దలు కొట్టామన్నారు. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చన్నారు.