హిమాచల్‌ప్రదేశ్ కుర్చీలాటలో కాంగ్రెస్ పైచేయి సాధించింది. నెంబర్ గేమ్‌లో బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టింది. రెబల్ ఎమ్మెల్యేల విషయంలో వ్యూహాత్మకంగా అడుగు వేసింది. రాజ్యసభ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 34కు చేరింది. అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలుండగా.. కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే సీఎం సుఖ్వీందర్సింగ్ పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహా ముగ్గురు స్వతంత్ర సభ్యులు బీజేపీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేటెస్ట్గా అక్కడ జరిగిన రాజ్యసభ ఎన్నికలో కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ వేశారు. దీంతో అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. కాంగ్రెస్‌కు తగిన బలం ఉన్నా కూడా.. క్రాస్ ఓటింగ్ కారణంగా ఆ పార్టీ అభ్యర్థి మనూ సింఘ్వీ ఓటమిపాలయ్యారు. మరో వైపు హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో 15 మంది ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కలదీప్ సింగ్ సస్పెన్షన్ వేటు వేశారు. బీజేపీ సభ్యులు సభలో స్పీకర్‌ను అగౌరవపరిచేలా ప్రవర్తిస్తున్నారని.. సభ సజావుగా సాగాలంటే వారిపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరుతూ మంత్రి హర్షవర్ధన్ చౌహాన్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ప్రభుత్వం బల నిరూపణ చేసుకునేందుకు సిద్ధమైంది.
110
previous post