104
విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ బీజేపీ పై విమర్శలు గుప్పించారు. 2019లో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా ఎజెండాగా ఎన్నికలకు వెళ్లాయన్నారు. సీఎం హోదాలో ఆనాడు చంద్రబాబు ఢిల్లీలో ధర్నా చేసి, ఎన్డీయేలో నుంచి బయటకు వచ్చారన్నారు.
ప్రతిపక్ష హోదాలో జగన్ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఎంపీలతో రాజీనామా చేశారన్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం సమస్య పరిష్కారాన్ని పక్కన పెట్టి మత రాజకీయాల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. విద్యార్థి యువజన సంఘాలు తలపెట్టిన ఛలో సీఎం క్యాంప్ కార్యాలయ కార్యక్రమానికి సీపీఐ మద్దతిస్తుందన్నారు.