తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం..

తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం

Advertisements

<p>తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‎ప్రెస్‎లో అగ్నిప్రమాదం జరిగింది&period; రైల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు&period;&period;2 బోగీలకు వ్యాపించాయి&period; అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే ఆ బోగీలను వేరు చేశారు&period; దీంతో పెను ప్రమాదం తప్పింది&period; ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు&period; రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది&period; తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న &&num;8216&semi;రాజధాని ఎక్స్‌ప్రెస్&&num;8217&semi;లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు&period; ఒక బోగీలో మొదలైన మంటలు క్షణాల వ్యవధిలోనే పక్కనే ఉన్న మరో బోగీకి కూడా వేగంగా వ్యాపించాయి&period; దీన్ని గమనించిన లోకో పైలట్&comma; రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు&period; వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి&comma; మంటలు వ్యాపించిన ఆ రెండు బోగీలను మిగతా రైలు నుంచి వేరు చేయడంతో భారీ ప్రమాదమే తప్పింది&period;<&sol;p>&NewLine;<p>షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు&period; రైల్వే అధికారులు&comma; ప్రయాణికులు సకాలంలో స్పందించి సురక్షితంగా బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు&period; దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు&period; సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు&period; ఈ ప్రమాదం కారణంగా కోటా రైల్వే సెక్షన్‌లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి&period; దీంతో ఆ రూట్‌లో నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..