33 ఏళ్ల తర్వాత హత్యాయత్నం కేసులో తీర్పు..

33 ఏళ్ల తర్వాత హత్యాయత్నం కేసులో తీర్పు

Advertisements

<p>33 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్యాయత్నం కేసులో సంచలన తీర్పు వెలువడింది&period; విచారణ సాగుతూ సాగుతూ మూడు దశాబ్దాలు దాటిన తర్వాత&period;&period; 84 ఏళ్ల వృద్ధుడిని కోర్టు దోషిగా తేల్చింది&period; ప్రస్తుతం సరిగా నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడికి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది&period; ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది&period; 1992 నవంబర్ 10à°¨ వైశాలి జిల్లాలోని రాఘవ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది&period; దీప్ రాయ్ కుటుంబ సభ్యులు అదాలత్ రాయ్ ఇంటి సమీపంలోని రోడ్డుపై గాజు పెంకులు వేయడంతో వివాదం చెలరేగింది&period; దీనిపై ప్రశ్నించిన అదాలత్ రాయ్&comma; ఆయన భార్య రామ్‌శకీ దేవిపై దీప్ రాయ్ కుటుంబం దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి&period;ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period; 1993 మార్చిలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా&comma; 1999లో కోర్టు అభియోగాలు నమోదు చేసింది&period; అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్లపాటు కేసు విచారణ కొనసాగింది&period; ఈ క్రమంలో నిందితుల్లో నలుగురు మరణించారు&period; కోర్టు మొత్తం పది మంది సాక్షులను విచారించింది&period;<br &sol;>&NewLine;అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం కోర్టు తుది తీర్పును వెలువరించి&comma; 84 ఏళ్ల దీప్ రాయ్‌ను దోషిగా నిర్ధారించింది&period; శిక్ష ఖరారు కోసం విచారణను జూన్ 2కి వాయిదా వేసింది&period; ప్రస్తుతం వృద్ధాప్యంతో ఇబ్బందులు పడుతున్న దీప్ రాయ్‌కు కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది&period; సోషల్ మీడియాలో కూడా ఈ కేసుపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.