మాల్దీవుల ప్రభుత్వంపై స్వదేశంలో తీవ్ర ఆగ్రహం

Maldivian government

Advertisements

&NewLine;<p>భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్న మాల్దీవుల ప్రభుత్వంపై స్వదేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది&period; ఈ వైఖరి దేశ అభివృద్ధికి హానికరంగా పరిణమించవచ్చునని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి&period; మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ&comma; డెమొక్రాటిక్ పార్టీ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అభివృద్ధి భాగస్వామిని దూరం చేసుకోవడం ఏమాత్రం సబబు కాదని&comma; మరీ ముఖ్యంగా సుదీర్ఘకాలంగా మైత్రిని కొనసాగిస్తున్న దేశాన్ని దూరం చేసుకుంటే దీర్ఘకాలిక అభివృద్ధికి హానికరమని ఎండీపీ&comma; డెమొక్రాట్‌ పార్టీల నేతలు విమర్శించారు&period; భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన పై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యల పర్యవసానంతో ఇరుదేశాల మధ్య దౌత్య బంధాలు దెబ్బతిన్నాయి&period; ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం చైనాకు చెందిన గూఢాచార నౌక మాల్దీవుల నౌకాశ్రయంలో తిష్ట వేయడం ఆసక్తికరంగా మారింది&period; భారత్‌తో దౌత్య బంధాలు దెబ్బతినడంతో మాల్దీవుల ప్రభుత్వం చైనా సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది&period; దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో రాజకీయ&comma; సైనిక మార్పులు వచ్చాయని అక్కడి ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి&period; భారత్‌ను దీర్ఘకాల మిత్రదేశంగా అభివర్ణించాయి&period; విదేశాంగ విధానంలో భాగంగా ప్రభుత్వం అన్ని అభివృద్ధి భాగస్వాములతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని విపక్ష నేతలు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..