యాదాద్రి పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం వచ్చేలా చేస్తా – కోమటిరెడ్డి

Yadadri Shrine

Advertisements

&NewLine;<p>యాదాద్రి పుణ్యక్షేత్రానికి పునర్‌వైభవం వచ్చేలా చర్యలు చేపడతామని రాష్ట్ర రహదారులు&comma; భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు&period; యాదాద్రి పంచనారసింహుల ఆలయాన్ని మంత్రి సందర్శించారు&period; క్షేత్రాభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు&period; అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు&period; కొండ కింద పట్టణంలోని ప్రధాన రహదారిలో అండర్‌పాస్‌ నిర్మించడం వల్ల స్థానికుల ఉపాధికి తీవ్ర అవరోధం ఏర్పడిందని తెలిపారు&period; భక్తుల అవసరాలు గమనించకుండా&period;&period; చేపట్టిన పనులు పూర్తి కావడానికి రూ&period;300 కోట్లు అవసరమని వైటీడీఏ అధికారులు చెబుతున్నారన్నారు&period; గత ప్రభుత్వం విశ్రాంత అధికారులతో చేపట్టిన పనులపై ఆరా తీయనున్నట్లు చెప్పారు&period; త్వరలో మరో సమీక్ష సమావేశం నిర్వహించి యాదాద్రిలో చోటుచేసుకున్న లోపాలను సరిచేయడంతోపాటు భక్తులకు అవసరమైన వసతులను సమకూర్చేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు&period; భక్తులు దేవుడి చెంత నిద్రచేసే మొక్కుకు అవకాశం కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు&period; స్వామివారిని భక్తులు ముఖ్యంగా వృద్ధులు&comma; పిల్లలు సులభంగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని&comma; క్షేత్రానికి వచ్చే ఆదాయంపై కాకుండా భక్తుల అవసరాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు&period; కొద్ది రోజుల్లోనే సీఎంను ఆహ్వానించి&period;&period; యాదగిరిగుట్ట&comma; బస్వాపురం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు&period; క్షేత్ర పరిధిలో దాతలకు స్థలాలు కేటాయిస్తే వారే కాటేజీలు నిర్మించుకుంటారన్నారు&period; సమీక్షలో విప్‌&comma; ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య&comma; జిల్లా కలెక్టర్‌ హన్మంత్‌ కె&period;జెండగే&comma; డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ రాజేశ్‌చంద్ర&comma; వైటీడీఏ వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు&comma; యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావు&comma; పలువురు అధికారులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..