77
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ కొత్త అభ్యర్థి పై నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ కౌన్సిలర్ ల సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి కానీ తన కుమారుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి కానీ టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు. కానీ పార్టీ లో ఎక్కడ తిరగని మాచని వెంకటేష్ ను ప్రకటించడం సరికాదని, తనకు ఏ మాత్రం తాము మద్దతు ఇవ్వము అన్నారు. కాబట్టి ఈ మాచని వెంకటేష్ నిర్ణయం పై అధిష్టానం మరోసారి పునరాలోచించాలని వారు కోరారు. లేని పక్షంలో నియోజకవర్గంలోని నాయకులు అంత కలిసి అధిష్టానం దగ్గరకు వెళ్లి కూర్చుంటామని తెలిపారు.