జవహర్ నగర్ గత మూడు సంవత్సరాల క్రితం జవహార్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెహ్రు నగర్ కాలనీ లో చర్చి పాస్టర్ అయినటువంటి అశోక్ చర్చి ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ స్థలంలో చర్చి అక్రమ నిర్మాణం చేపట్టారని బుధవారం కాప్రా తాసిల్దార్ మతిన్, ఆర్ఐ శ్రీలక్ష్మి సిబ్బందితో కలిపి కూల్చివేశారు. దీనిపై క్రైస్తవ భక్తులు నెహ్రు నగర్ కాలనీ బస్తి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న బిఆర్ఎస్ మేడ్చల్ జిల్లా సీనియర్ నాయకులు ఆలూరి రాజశేఖర్, 14 డివిజన్ కార్పొరేటర్ ఆలూరి సంగీత సంఘటన స్థలానికి చేరుకొని తాసిల్దార్ ఆర్ఐ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ప్రార్థన మందిరాన్ని దౌర్జన్యంగా ఏలాంటి సమాచారం లేకుండా కూల్చివేయడం క్రైస్తవుల మనోభావాలను మత విశ్వాసాలను కించపరుస్తూ క్రిస్మస్ పండుగ ముందు ప్రార్థనలు చేసుకోకుండా మందిరాన్ని కూల్చివేయడం హేయమైన చర్యని వారు మండిపడ్డారు. దీనిపైన వెంటనే తాసిల్దార్ క్రైస్తవులకు సమాధానం చెప్పాలని వెంటనే కూల్చిన చోటే చర్చి పునర్నిర్మాణం చేపట్టాలని క్రైస్తవులు డిమాండ్ చేశారు.
నెహ్రు నగర్ లో చర్చి కూల్చివేత….
61
previous post