హిందూ, ముస్లిం, క్రైస్తవులనే భేదం లేకుండా ఐకమత్యంతో అభివృద్ధికి పాటుపడాలని హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఆస్థానం నిత్యాన్నదాత అల్తాఫ్ బాబా అన్నారు. కొండపల్లి పట్టణంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఆస్థానంలో శనివారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని పాస్టర్లు హాజరై క్రీస్తు జన్మ వృత్తాంతంపై సందేశమిచ్చారు. ఈ సందర్భంగా అల్తాఫ్ బాబా మాట్లాడుతూ క్రిస్మస్ ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పాస్టర్ ఎలీషా సేవా అవార్డు అందుకోవడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. ఈభూమి ఉన్నంత వరకు షా బుఖారి బాబా ఆస్థానంలో నిత్య అన్నదానం కొనసాగాలని, నిత్యం కనీసం ఐదు వేల మందికి అన్నదానం చేసేలా ప్రార్థించాలని కోరారు. అనంతరం పాస్టర్లను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఐకమత్యంతో అభివృద్ధి…సెమీ క్రిస్మస్ వేడుకల్లో అల్తాఫ్ బాబా
60
previous post