గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్ ఆధ్వర్యంలో బీసీ సంకల్ప సభ నిర్వహించారు. ముందుగా ఎన్నారై జంక్షన్ లో నేతన్న సర్కిల్ వద్ద నేతన్న విగ్రహానికి పూలదండ వేసి అక్కడ నుండి సీతారామ కోవెల మీదుగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి గుడివరకు బిసి సంక్షేమ సంఘం నాయకులు, అభిమానులు ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారని వారికి రాజకీయ పార్టీలు సీట్ల కేటాయించడం లేదని బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని చట్టసభల్లో బీసీల్లోని అన్ని కులాల వారికి అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలు అధికంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో కూడ అన్ని రాజకీయ పార్టీలు బీసీ అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు మాట్లాడుతూ బీసీలకు రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం లేదని మేము బీసీ అభ్యర్థులను గెలిపించి పంపిస్తుంటే అనంతరం వారు రాజకీయ పార్టీలకు అంటకాగుతున్నారని, అందుకే ఈసారి బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇద్దరు అభ్యర్థులను మంగళగిరిలో పారేపల్లి మహేష్ ను గుంటూరు -2 లో క్రాంతి కుమార్ ను ఎన్నికల బరిలో ఉంచుతున్నామని తెలియజేశారు. బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో అవకాశం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచించాలని ఆయన తెలియజేసారు.
మేము కేవలం ఓట్లు వెయ్యడానికేనా… రాజకీయాలకు పని చెయ్యమా
75
previous post