Health Tips:
భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మొదటిగా జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. నీరు తాగడం వల్ల కడుపులో ఉన్న యాసిడ్ పలుచన అవుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టంగా మారుస్తుంది. అందుకే ఆహారం తిన్నవెంటనే నీరు తాగకూడదని వైద్యులు సూచిస్తున్నారు. తిన్నవెంటనే నీటిని తీసుకోవడం వల్ల ఈ రసాలు పలుచన అవుతాయి.
ఇది చదవండి: డ్రాగన్ ఫ్రూట్‌తో అందమైన చర్మం మీ సొంతం..!
శరీరంలో బలహీనత, అలసట, ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. నీరు తాగడం వల్ల కడుపులో ఉండే ఆహారం, గాలి మధ్య ఉండే మిశ్రమం పలుచన అవుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అపానవాయువు, నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు, అజీర్ణం, మలబద్ధకం ఏర్పడతాయి. కడుపులో చికాకు, పొక్కులు వంటి సమస్యలు వస్తాయి. భోజనం చేసేటప్పుడు నీరు తాగడానికి దూరంగా ఉండాలి.
ఇది చదవండి: భోజనం చేసిన తర్వాత బెల్లం తింటున్నారా..!
చిన్న పిల్లలు అన్నం తినేటప్పుడు నీరు తీసుకోవచ్చు. అయితే పెద్దవారు మాత్రం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఆహారం జీర్ణం కావడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. అదే సమయంలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ఆహారం తీసుకున్న 45 నుంచి 60 నిమిషాల తర్వాతే మంచినీరు తాగాలి. ఆహారం తినే అరగంట ముందు నీళ్లు తాగాలనే విషయాన్ని గుర్తుంచుకోండి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.