ఓంకారేశ్వరుడు ఎలా వెలశాడో తెలుసా?

Omkareshwar

Advertisements

&NewLine;<p>వింధ్య పర్వతాలలో ఓంకార క్షేత్రమున్నది అంటారు&period; ఆ క్షేత్రాన్ని గురించి తప్పక తెలుసుకోవాలి&period; పూర్వకాలంలో ఒకసారి నారదుడు క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ&comma; వింధ్య పర్వతము మీదికి వచ్చాడు&period; నారద మహర్షి రాగానే వింధ్యరాజు ఎదురువెళ్ళి స్వాగత సత్కారాలందించి&period; ఉచిత రీతిన గౌరవించాడు&period; వారి ఇద్దరి మధ్య కుశల ప్రశ్నలు అయిన తరువాత ఇష్టాగోష్టి జరుగుతోంది&period; ఆ సమయంలో వింధ్యరాజు &&num;8220&semi;నారద మహర్షి మీరు త్రిలోక సంచారులు&period; మీకు తెలియని విషయం ఏదీ లేదు&period; నా దగ్గర సమస్త సంపదలు&comma; సకల ధాతువులు&comma; బంగారము మొదలైన లోహములు కోకొల్లలుగా ఉన్నాయి&period; అలాంటప్పుడు పర్వతాలలో సార్వభౌముడు అని చెప్పదగినవాడు నేను గాక ఇంకెవరు ఉంటారు&quest;&&num;8221&semi; అన్నాడు&period; ఆ మాట విని పెద్ద నిట్టూర్పు విడిచాడు నారదుడు&period; నారదుడు తనని మెచ్చుకోకుండా అలా నిట్టూర్పు విడిచేసరికి ఆశ్చర్యపోయాడు వింధ్యరాజు&period; మహర్షి నిట్టూర్పుకు కారణము ఏమిటి&quest; పర్వతాలలో సార్వభౌముడు తను కాదా&quest; అని ఈ రకంగా ఆలోచిస్తూ &&num;8220&semi;మహర్షీ నేను అలా అనగానే ఇలా నిట్టూర్పు విడుస్తున్నారు ఎందుకు&quest;&quest; మీరు అలా నిట్టూర్చడం వెనుక అర్థం ఏమిటి&quest;&&num;8221&semi; అన్నాడు&period; దానికి నారదుడు &&num;8220&semi;వింధ్యరాజా&excl; నువ్వు చెప్పినదంతా నిజమే&period; నీ దగ్గర సర్వసంపదలు ఉన్నాయి&comma; సమస్త ధాతువులు ఉన్నాయి&comma; బంగారము మొదలుగా గల లోహాలు అన్నీ ఉన్న మాట నిజమే&period; కాని మేరుపర్వత శిఖరాల గురించి తెలియదా&quest;&quest; ఆ శిఖరాలు మహోన్నతములై దేవలోకం దాకా వ్యాపించి ఉన్నాయి&period; అందుకని ఇంద్రాది దేవతలందరూ అక్కడ విహరిస్తూ ఉంటారు&period; మరి వారందరూ నీదగ్గరకు వస్తున్నారా&quest;&quest; నీకా భాగ్యము లేదు&period; అందుకే నాకు విచారము&period; నా నిట్టూర్పుకు కారణం అదే&&num;8221&semi; అన్నాడు&period; మేరు పర్వతము కన్న గొప్ప అనిపించుకోవాలనే పట్టుదల వింధ్య పర్వతానికి కలిగింది&period; దానికోసం ఆ పరమేశ్వరుని ఆరాధించటము తప్ప మరే మార్గం లేదు అని నిశ్చయించి తపస్సు చెయ్యటానికి ఓంకార యంత్రము ఒకటి తయారుచేసి&comma; దాని మీద పార్ధివ లింగము స్థాపించి సంకల్పించాడు&period; ఆ రకంగా నూరు నెలలు ఘోరమైన తపస్సు చేశాడు&period; అతడి తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పార్వతీపతి&period; ప్రత్యక్షమై &&num;8216&semi;ఏ వరం కావాలో కోరుకో&excl;&&num;8217&semi; అన్నాడు&period; &&num;8220&semi;పరమేశ్వరా&excl; చంద్రమౌళీశ్వరా&excl; పాహిమాం తండ్రీ&excl; పాహిమాం&excl; నీ కరుణ లేశమాత్రము ఉన్నప్పటికీ&comma; నీ భక్తుల కోరికలు పూర్తిగా తీరిపోతాయి&period; అలాంటిది నువ్వు ప్రసన్నమైనావు&period; నాకు ఇంక కావలసినది ఏమున్నది&period; అయినప్పటికి నాదొక చిన్న ప్రార్ధన&period; మేరువు శిఖరాలు బాగా పెద్దవిగా&comma; దేవతలు విహరించటానికి వీలుగా ఉండటము నాకు భరించలేకుండా ఉన్నది&period; దేవతలందరూ నీ పాదాలకు నమస్కరిస్తారు కాబట్టి&period; అటువంటి నువ్వు&comma; నా శిఖరాన సదా నివసించవలసినదిగా నా ప్రార్ధన&&num;8221&semi; అన్నాడు వింధ్యరాజు&period; ఆ పలుకులు ఆలకించిన శంకరుడు&comma; భక్తుడైన వింధ్యరాజు కోరిక తీరుస్తానన్నాడు&period;&period; ఇప్పుడు ఓంకార యంత్రము&comma; పార్థివ లింగము రెండుగా అయిపోయినాయి&period; ఓంకార యంత్రమందు ఉద్భవించినవాడు కాబట్టి ఓంకారేశ్వరుడు&comma; పార్ధివ లింగమందు ఉద్భవించినవాడు కాబట్టి అమలేశ్వరుడు అయ్యాడు&period; ఇక్కడ నర్మదానది కూడా రెండు పాయలుగా చీలిపోయింది&period; ఆ రెండు పాయల నడుము ఒక శిఖరమున్నది&period; ఆ శిఖరము మీద సూర్యవంశపు రాజు మాంధాత ఓంకార రూపంలో దేవాలయాలు కట్టించాడు&period; ఓంకార క్షేత్రానికి వెళ్ళాలి అంటే యాత్రికులు నర్మదా నదిని పడవల మీద దాటి బ్రహ్మపురి&comma; విష్ణువురి అనే కొండలను దర్శించి వెళ్ళాలి&period; ఇదీ ఓంకారేశ్వరుడి కథ&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..