అందానికి బంగాళాదుంప

Potato for beauty

Advertisements

&NewLine;<p>బంగాళాదుంప తినేందుకు రుచిగా ఉండటమే కాదు&comma; అందానికి అడ్డుగా నిలిచే ఎన్నో సమస్యల్ని తీరుస్తుంది&period; కళ్ల నుంచి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుటుంది&period; ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కళ్లే&period; అయితే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం&comma; కళ్లు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు&period; బంగాళాదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్‌లో వేస్తే కొంచెం జ్యూస్‌ వస్తుంది&period; దానిలో దూది ముంచి&comma; కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి&period; ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుతాయి&period; బంగాళాదుంప రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావడం తగ్గుతుంది&period; ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి&period; ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి బంగాళాదుంప రసాన్ని రాసిన చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది&period; చక్కని ఛాయకి బంగాళాదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి&period; ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంటపాటు వదిలేయండి&period; ఇలా చేయడం వల్ల చర్మం మృదువు అవడంతో పాటు&comma; ఛాయ పెరుగుతుంది&period; చర్మంపై ఉన్న జిడ్డుని కూడా అది పీల్చేసుకుంటుంది&period; దాంతో ముఖం తాజాగా మారుతుంది&period; అలాగే బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం&comma; తేనె కలిపి ముఖానికి పట్టించి&comma; పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం రంగు తేలుతుంది&period; ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపండి&period; ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరే వరకూ ఉంచండి&period; మొదట గోరువెచ్చటి నీళ్లతో&comma; తరవాత చన్నీళ్లతో కడిగేసుకోండి&period; అలాగే బంగాళాదుంపని బాగా ఉడకబెట్టి ముద్దలా చేయండి&period; చల్లారాక ఒక స్పూను పాల పౌడర్‌ని&comma; ఒక స్పూను బాదం నూనెని కలిపి పేస్టులా చేయండి&period; దానిని ముఖానికి రాసుకుని పావుగంట తరవాత శుభ్రపరుచుకోండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు