స్విమ్స్ లో కార్మికులను వేధించవద్దు… సిఐటియు

swim hospital

Advertisements

&NewLine;<p>స్విమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులను వేధించవద్దని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి టిటిడి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు&period; శనివారం మధ్యాహ్నం స్విమ్స్ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి నేతృత్వంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్&comma; జనరల్ మేనేజర్ బాబు&comma; నర్సింగ్ సూపరింటెండెంట్ ప్రభావతిలతో సంయుక్తంగా చర్చలు జరిపారు&period; కార్మికులను ఇష్టం వచ్చిన రీతిలో తొలగిస్తున్నారని&comma; చిన్న&comma; చిన్న కారణాలతో ఇబ్బందులు పెడుతున్నారని సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నారని లక్ష్మీ శ్రీనివాసా కార్పొరేషన్ లో చేరిన తర్వాత తమను మరిన్ని ఇబ్బందులకు గురి చేయడం న్యాయం కాదని కార్మికులు మొరపెట్టుకున్నారు&period; ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను యాజమాన్యానికి వివరించారు&period; కార్పొరేషన్ కార్మికులను ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని&comma; పని వేళలు నిర్దేశించడంలో స్పష్టత లేదని తెలిపారు&period; సెలవుల కేటాయింపులు సూపర్వైజర్లకు సంబంధం లేకుండా అధికార యంత్రాంగమే ఓ విధానాన్ని నిర్ణయించాలని కోరారు&period; దానికి స్విమ్స్ యాజమాన్యం అంగీకరించింది&period; సెలవులు ఇచ్చే విషయంలో కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా&comma; సూపర్వైజర్లకు సంబంధం లేకుండా తామే ఓ విధానాన్ని నిర్ణయిస్తామని అంగీకరించారు&period; వేతనాలు పెంపుదలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని&comma; కొన్ని విధాన నిర్ణయాలు తర్వాతే వేతనాల పెంపుదలను ప్రకటిస్తామని తెలిపారు&period; డాక్టర్లు&comma; నర్సులకు లాగే వర్కర్లకు పని విధానాన్ని&comma; పని గంటలను నిర్ణయిస్తామని&comma; రాత్రి డ్యూటీలలో మూడు గంటల విశ్రాంతికి అనుమతిస్తున్నట్టు ప్రకటించారు&period; తొలగించిన కార్మికులందరినీ పనిలోకి తీసుకుంటామని తెలిపారు&period; గతంలో జరిగిన ఇబ్బందులను సరి చేస్తామని రానున్న రోజుల్లో ఎలాంటి వేధింపులు ఉండవని కార్మికులు యాజమాన్యానికి సహకరించాలని డాక్టర్ రామ్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు&period; కార్మిక నాయకులు&comma; కార్మికులు ఈ ప్రతిపాదనకు అంగీకరించారు&period; ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలతో పాటు స్విమ్స్ కార్మికుల యూనియన్ నేతలు రవి&comma; ముత్తు&comma; సూరి&comma; కోటయ్య తదితరులతో పాటు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..