ఓటు అనే ఆయుధాన్ని మద్యం మత్తులో వృథా చేసుకోవద్దు..

revenue kings

Advertisements

&NewLine;<p>తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరగాలని&comma; ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కు డ్రంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది&period; అదే సమయంలో ప్రతీ పోలింగ్ బూత్ ముందు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించాలని&comma; మద్యం తాగలేదని నిర్ధారణ అయ్యాకే ఓటేసేందుకు అనుమతించాలని డిమాండ్ చేసింది&period; మద్యం మత్తులో ఎవరికి ఓటేస్తున్నామో తెలియని స్థితిలో ఓటు హక్కు వినియోగించకోనీయ వద్దని ఈసీకి వినతి పత్రం అందజేసింది&period; ఐదేళ్ల భవిష్యత్తును ఓటర్లు మద్యం మత్తులో నాశనం చేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని రెవెన్యూ కింగ్స్ ఆఫ్ డ్రంకర్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది&period; నవంబర్ 30న ప్రతి పోలింగ్ స్టేషన్ బయట బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని అసోసియేషన్ సభ్యులు కోరారు&period; ఈ వినతి పత్రం గురించి తెలిసినపుడు తొలుత ఆశ్చర్యపోయినా తర్వాత ఆలోచింపజేసేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి&period; వినతిపత్రం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు&period; ఓటు అనే ఆయుధాన్ని మద్యం మత్తులో వృథా చేసుకోవద్దని సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతుందని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్