కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project):
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతూ ప్రజలను దారి మళ్లిస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వ ఘోర వైఫల్యముందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చిన విషయాన్న గుర్తు చేశారు. దీంతోపాటు రాష్ట్ర విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఇచ్చిందన్నారు. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు కాళేశ్వరం సందర్శించి వచ్చారన్నారు. అయినప్పటికీ మళ్లీ కాళేశ్వరం సందర్శన, విచారణ పేరుతో ఈ డ్రామాలేందని నిలదీశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ రూపొందించిన నివేదికలోని అంశాలను మీడియాకు వివరించారు. ఈరోజు సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో ప్రజాహిత తొలిదశ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.. ఏమన్నారంటే…
బండి సంజయ్ వ్యాఖ్యలు:
కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని ప్రజాహిత యాత్ర తొలిదశ యాత్రను ప్రారంభించాం. ఈరోజు అగ్రహారం వద్ద ముగించాను. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రజాహిత యాత్రను కొనసాగించాను. ఎక్కడికి పోయినా మోదీ గురించి మాట్లాడుతున్నారు. దేశానికి మోదీ చేసిన సేవలను చెబుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రజాహిత యాత్రను ఆశీర్వదించారు. ఈ యాత్ర సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నా పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధికి, ముఖ్యంగా ప్రధానంగా 7 సంక్షేమ పథకాలకు మాత్రమే ఖర్చు చేసిన నిధుల వివరాలను గ్రామ గ్రామాన వివరించాను.
ఈ ఒక్క సిరిసిల్ల జిల్లాకు 1408 కోట్ల రూపాయల నిధులిచ్చాం. అంత పెద్ద ఎత్తున నిధులు మోదీ ప్రభుత్వం ఇస్తుందని తెలుసుకుని ప్రజలే ఆశ్చర్యపోయారు. కేంద్రం నయాపైసా ఇయ్యలేదు.. అభివ్రుద్ధి నిధులన్నీ రాష్ట్రానివేనని కేసీఆర్, కేటీఆర్ ఇన్నాళ్లు చేసిన ప్రచారమంతా ఒట్టిదేనని ప్రజలు గ్రహించారు. బీఆర్ఎస్ మూర్ఖులు కూడా వాస్తవాలు గ్రహించాలి. దేశంతో రాష్ట్రానికి కూడా కేంద్రం నిధులిస్తోంది.. కొత్తేముందని ఇప్పుడు చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు తెలంగాణలో గ్రామాల అభివ్రుద్ధికి, ఇండ్ల కోసం మంజూరు చేసిన నిధులను ఎందుకు దారి మళ్లించారో సమాధానం చెప్పాలి. 14, 15 ఆర్దిక సంఘం నిధుల్లో గోల్ మాల్ జరిగింది. మొక్కల పెంపకం కోసం ఇచ్చిన వందల కోట్ల నిధులను దోచుకుతిన్నారు… ఇదేమని ప్రశ్నిస్తే… జవాబు చెప్పలేక నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.మేం గ్రామాలకిచ్చిన నిధులపై పోస్టర్లు వేస్తే తప్పేంది? స్వయం ప్రకటిత మేధావి ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు. మేం పోస్టర్లు వేస్తే మీరు మెడలో బోర్డులు వేసుకుని తిరుగు.. ఎవరు వద్దన్నారు? నన్ను గెలికితే ఊరుకునే ప్రసక్తే లేదు. గచ్చిబౌలిలో రూ.600 కోట్ల విలువ చేసే భూదాన భూములను ఏ విధంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, బోయినిపల్లి మండలంలోని నర్సింగాపూర్ లో 20 ఎకరాల సింగిల్ బిట్ ఎట్లా కొన్నారో అన్నీ బయటపెట్టాల్సి వస్తది.
Follow us on : Facebook, Instagram & YouTube.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కాళేశ్వరం, క్రిష్ణా నది నీళ్లపై అసెంబ్లీ వేదికగా డ్రామాలాడుతున్నయ్. ప్రజలకిచ్చిన హామీల అమలుపై మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ చేసిన మోసాలను బయటకు రాకుండా ఆ పార్టీ నేతలు కుట్ర చేస్తున్నరు. కాళేశ్వరం విషయానికొస్తే….నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సందర్శించి గత అక్టోబర్ లో సందర్శించింది. 20 అంశాలపై వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. నవంబర్ 1న కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project) పై నివేదిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అందులో ఏముందంటే…(నివేదిక కాపీనీ చూపిస్తూ…) ‘‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్(2021) నిబంధనలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఉల్లంచింది. ఇది ఘోర తప్పిదం. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదంవల్ల ప్రజల జీవితాలకు, ఆర్దిక వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదం కలిగే అవకాశం ఏర్పడింది. మేడిగడ్డ బ్యారేజీలోని ఒక బ్లాక్ లో తలెత్తిన సమస్యవల్ల మొత్తం బ్యారేజీ సక్రమంగా పనిచేయని దుస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు మొత్తం బ్యారేజీని ఉపయోగించడానికి అవకాశమే లేదు.’’ అని నివేదికలో పేర్కొన్నారు.
’’బ్యారేజీలోని బ్లాక్ నెంబర్ 7లో నెలకొన్న సమస్య మరమ్మతు చేయడానికి వీలు లేకుండా పోయింది. ఆ బ్లాక్ మొత్తాన్ని పునాదుల నుండి తొలగించి మళ్లీ పునర్ నిర్మించాల్సిందే. ఈ నిర్మాణాన్ని పరిశీలిస్తే… మేడిగడ్డ బ్యారేజీలోని ఇతర బ్లాక్ లు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మొత్తం బ్యారేజీనే పునర్ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి తీవ్రం కాకముందే బ్యారేజీని పునరుద్దరించాలి.అంతవరకు రిజర్వాయర్ లో నీటిని నింపకూడదు. పెడచెవిన పెట్టి నీటిని నింపితే పైపింగ్ సమస్య ఏర్పడి ప్రజలకు నీటిని సరఫరా చేయలేని దుస్థితి ఏర్పడుతుంది. కాళేశ్వరంలో ప్రాజెక్టు (Kaleswaram Project) లోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం బలహీనంగా ఉన్నాయి. ఈ బ్యారేజీల్లో సైతం మేడిగడ్డ తరహాలో సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం నెలకొంది. అన్నారం బ్యారేజీ దిగువన బాయిలింగ్ సమస్య సంకేతాలు కన్పిస్తున్నాయి. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.