ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబు అరెస్ట్…

Eco Overseas Consultancy

Advertisements

&NewLine;<p>నరసరావుపేట ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబును చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు&period; ఇటీవల అమెరికా వెళ్లేందుకు పల్నాడు జిల్లాకు చెందిన హేమనాథ్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు&period; ఈ నెల 16à°¨ చెన్నై యూఎస్ కాన్సులేట్ లో ఇంటర్వ్యూకి హేమనాధ్ హాజరయ్యాడు&period; ధ్రువ పత్రాలను పరిశీలించిన యూఎస్ కాన్సులేట్ అధికారులు …హేమనాధ్ సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీ ధృవపత్రాలుగా గుర్తించి…చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు …యూఎస్ కాన్సులేట్ ఫిర్యాదు చేసింది&period; వెంటనే హేమనాధ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు&period; నరసరావుపేటకి చెందిన ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ యజమాని హరిబాబు నకిలీ ధ్రువ పత్రాలు ఇచ్చినట్లు పోలీసులకు తెలిపాడు&period; హేమనాధ్ తో పాటు మరికొందరు విద్యార్థులకు కూడా హరిబాబు నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు&period; నర్సారావుపేటలోని ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ లో పోలీసులు తనిఖీలు చేసి కంప్యూటర్&comma; రెండు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని హరిబాబుపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు&period; నకిలీ సర్టిఫికెట్లు ఎవరైనా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్