విజయవాడ, ఢిల్లీ రావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్(NTR District Collector).
రేపటి నుంచి నామినేషన్లు(Election Nominations) ప్రక్రియ ప్రారంభం అవుతుంది. రిటర్నింగ్ ఆఫీస్ లో ప్రొసీజర్ ప్రకారం నోటిఫికేషన్ ఉంచాం. నామినేషన్లు ప్రక్రియ ఏ విధంగా ఉన్నాయి, నిబంధనలు గురించి వివరించేలా ఏర్పాటు చేశాం. ఫామ్ ఒన్ ను రిటర్నింగ్ అధికారులు తెలుగు, ఇంగ్లీషు భాషలలో అందిస్తారు.
రేపు ఉదయం 11 తరువాత నామినేషన్లు(Election Nominations) ప్రారంభం అవుతుంది.
విజయవాడకు కలెక్టర్ ఆర్.ఒ గా ఉన్నారు. విజయవాడ పశ్చిమకు మున్సిపల్ కమీషనర్, విజయవాడ ఈస్ట్ కు సబ్ కలెక్టర్, మైలవరం కు జాయింట్ కలెక్టర్ లు ఆర్.ఒ గా ఉన్నారు. ఇతర నియోజకవర్గాలలో ఆర్.డి.ఒ, డిప్యూటీ కలెక్టర్ లు ఆర్.ఒ లుగా ఉన్నారు. ఇప్పటికే టూ ఎ, టూ బి, గురించి రాజకీయ పార్టీలు నాయకులకు అవగాహన కల్పించాం. హార్ట్ కాపీ, సాప్ట్ కాపీలను కూడా వారికి అంద చేశాం. ఫాం 26 అఫిడవిట్ లో ఏయే అంశాలు రాయాలో పూర్తిగా వివరించాం. ఆర్.ఒ లు ఏయే అంశాలను పరిశిలిస్తారు… ఆమోదానికి, తిస్కరణకి గలా కారణాలు పై అవగాహన కల్పించాం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈనెల 25 మధ్యాహ్నం మూడు గంటల లోపు ఫాం బి సమర్పించాలి.
ఇప్పుడు ఫోటో కూడా తప్పనిసరి చేశారు కాబట్టి నిబంధనలు ప్రకారం తగిన సైజులో పెట్టాలి. బ్యాంకు ఎకౌంట్లు, కేసులకు సంబందించిన వివరాలు ఎలా పూర్తి చేయాలో చెప్పాం. 18 నుంచి 25వ తేదీ లోపు సకాలంలో నామినేషన్లు వేయాలి. సెక్యూరిటీ డిపాజిట్ జనరల్ అభ్యర్థి పది వేలు నామినేషన్ సమయంలో ఇవ్వాలి. నామినేషన్ మొత్తం పరిశీలనలకు చెక్ లిస్ట్ తయారు చేశాం. నామినేషన్లు(Nominations) సమయంలో కేవలం ఐదుగురికి మాత్రమే లోపలకు అనుమతి ఉంటుంది. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొత్తం వీడియో గ్రఫీ చేయిస్తున్నాం. కార్యాలయాలు లోపల, బయట కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేశాం. జాతీయ, రాష్ట్ర గుర్తింపు పార్టీ లకు ఒక ప్రపోజల్ చాలు. రిజిస్టర్ పార్టీ కి పది ప్రపోజల్స్ ఉండాలి. ఒక వ్యక్తి నాలుగు నామినేషన్లు వేసుకోవచ్చు. 26వ తేదీ నామినేషన్లు స్క్రూటినీ జరుగుతుంది. ఆ సమయంలో అభ్యర్థులు న్యాయవాదితో సహా వచ్చి పరిశీలీంచవచ్చు. వాలిడ్, రిజక్టడ్ నామినేషన్లు గుర్తించి ప్రకటిస్తాం. ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా సిబ్బంది కి శిక్షణ ఇచ్చాం. ఫాం 5 ద్వారా ఎవరైనా విత్ డ్రా చేసుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థులు జాబితా ఖరారు చేశాక సింబల్స్ కేటాయింపు ఆర్.ఒ చేస్తారు. ఫాం 7a ను 29వ తేదీన అభ్యర్థులు కు అంద చేస్తాం. ఇవన్నీ పూర్తి అయ్యాక పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరుగుతుంది.
యన్టీఆర్ జిల్లాలో మే 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 3,4 తేదీలలో ఈవిఎం లను రెడి చేస్తాం
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అన్ని స్థాయిల్లో సిబ్బంది కి శిక్షణ ఇస్తాం. మే 7,8,9 తేదీలలో హోం ఓటింగ్ చేపడతాం. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి చేస్తాం. నోవా కాలేజ్ ప్రాంగణంలో స్ట్రాంగ్ రూం లు ఉన్నాయి. పోలింగ్ తరువాత అక్కడే ఈవిఎం లు భద్రపరుస్తాం. జూన్ నాలుగున 14 కౌంటింగ్ కేంద్రాలు పెడుతున్నాం. విజయవాడ పార్లమెంటు కు సంబంధించి మరో కేంద్రం అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. 1791 పోలింగ్ కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నార్మల్, క్రిటికల్ కేంద్రాలు గురించి అదనలు భద్రత చర్యలు తీసుకుంటాం. గతంలో జరిగిన ఘటనల దృష్ష్యా మైక్రో అబ్జర్వర్లను పంపి పరిశీలన చేస్తాం.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ…