విఫల సీఎం గా చరిత్రలో మిగిలిపోతావ్ జగన్ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ చెబుతున్న 99శాతం హామీల అమలు అనేది అతిపెద్ద బూటకమని మండిపడ్డారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ భేటీలో జగన్ నెరవేర్చని హామీలు, మోసాలను ఎండగడుతూ ‘ప్రజాకోర్టు’పేరుతో ఛార్జిషీట్ విడుదల చేశారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తోన్న జగన్కు ప్రజాకోర్టులో శిక్ష పడటం ఖాయమని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్.. ప్రజలను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. మేనిఫెస్టో, పాదయాత్రలో మొత్తం 730 హామీల్లో 21శాతం కూడా అమలు చేయకుండా 99 శాతం అమలు చేశానంటూ ప్రజల్ని వంచిస్తున్నాడని విమర్శించారు. మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేస్తున్న జగన్కు మరో రెండు నెలల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి.. మాట తప్పి మడమ తిప్పి రూ.64వేల కోట్ల భారం మోపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం హామీని అటకెక్కించి మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టుపెట్టి రూ.25వేల కోట్లు అప్పులు తెచ్చారని ధ్వజమెత్తారు. Read Also..
విఫల సీఎం గా చరిత్రలో మిగిలిపోతావ్ : Chandrababu
92
previous post