Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Telangana వాహనాలపై TS ఉండదు.. TG నే!

వాహనాలపై TS ఉండదు.. TG నే!

by Satya
Revanth Reddy

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాహన రిజిస్ట్రేషన్లలో ఇప్పటిరకు నెంబరుకు ముందు రాష్ట్రం పేరును సూచించేలా TS అనే అక్షరాలు ఉండేవి. ఇప్పుడు ‘టీఎస్’ అనే అక్షరాలు కనుమరుగు కానున్నాయి. టీఎస్ స్థానంలో ఇకపై TG అనే అక్షరాలు రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, పలు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయహే తెలంగాణను ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర చిహ్నంలో తెలంగాణ ఆత్మ, స్ఫూర్తి ప్రతిబింబించేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. ఆరు గ్యారెంటీలపై లోతుగా చర్చించిన అనంతరం రెండు గ్యారెంటీలు అమలుకు నిర్ణయం తీసుకున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను అమలు చేయాలని నిర్ణయించారు. Read Also..

Advertisements

You may also like

Our Visitor

039183
Total views : 194593

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: