అమరావతి ఉద్యమం కీలక దశకు చేరుకుందని, అందరూ ఐక్యంగా నడిచి జగన్‌ను గద్దె దించాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. వచ్చే మూడు నెలలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, అందరం పట్టుదలతో పనిచేసి అమరావతి కంటకులను ఇంటికి పంపిద్దామని ప్రతినబూనారు. సడలని సంకల్పంతో ముందుకు సాగుతున్న రైతులు, మహిళలకు సంఘీభావాన్ని ప్రకటించారు. అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభమై నాలుగేళ్లు అయిన సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్షా శిబిరంలో రాజధాని రైతు ఐక్య కార్యాచరణ సమితి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ ఉద్యమానికి తాము వెన్నుదన్నుగా ఉంటామని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు హామీ ఇచ్చారు. రైతు గుండె పగిలి నేటికి నాలుగేళ్లు అయ్యిందంటూ జ్ఞాపకాలు స్మరించుకున్నారు. శిబిరంలో రైతు జెండాకు వందనం చేసి, ఆకుపచ్చ బెలూన్లు ఎగురవేశారు. అనంతరం నిరసన దీక్షలు చేపట్టారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలి, జగన్ నమ్మకద్రోహానికి 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. సకాలంలో వార్షిక కౌలు చెల్లించలేని, చేతకాని ప్రభుత్వం దిగిపోవాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
జగన్ నమ్మకద్రోహానికి బలైన రైతులు….
96
previous post