పొట్ట కొచ్చిన పంటను కాపాడేందుకు రైతుల అవస్థలు…

Farmers' plight to protect the harvested crop...

Advertisements

&NewLine;<p>పొట్ట కొచ్చిన పంటను కాపాడేందుకు రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని&comma; సాగునీరు కోసం నానా తంటాలు పడుతున్నారని&comma; కాలువల ద్వారా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుందని&comma; బోరు బావుల పైనే ఆధారపడి రైతులు పంటను కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నారు&period; రైతుల సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని&comma;&comma; రిజర్వాయర్లలో ఉన్న నీటిని సక్రమంగా వినియోగించలేని దుస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి విమర్శించారు&period; గురువారం కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లున్న వాడుకోలేని అసమర్ధ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందన్నారు&period; కనీసం కుంటలు&comma; చెరువులు నింపుదామన్న సోయి&comma; కాలువలకు నీళ్లు ఇచ్చి పంటలను కాపాడుదామన్న ధ్యాస రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జిల్లాలోని అనేక ప్రాంతాలు సాగునీటి కోసం అలమటిస్తున్నాయని&comma; అనేక చోట్ల పంటలు ఎండిపోతున్నాయని&comma; నీళ్లు లేక మిర్రలు బారిన పొలాల్లోని వరి పైరు తల వాలుస్తున్నాయన్నారు&period; జిల్లాలో నీటి నిల్వలు అనేకం ఉన్న &comma; నీటిని సక్రమంగా సరఫరా చేయకపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు&period; చాలామంది రైతులు సాగునీటి కోసం బోర్లు బావుల పై ఆధార పడాల్సిన పరిస్థితి వచ్చిందని&comma; కొత్త బావులు తవ్వుకుంటూ బోర్లు వేస్తూ పంటలను కాపాడేందుకు సర్వశక్తులు దారపోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు&period; చేతికోచ్చిన పంట కోసం రైతులు పడుతున్న కష్టం దయనీయంగా ఉన్నా మానవ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు&period; సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు&period; రైతుల కష్టాలను పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహార శైలిని నిరసిస్తూ ఈనెల 16న బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట ధర్నా&comma; ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు&period; జిల్లాలోని రైతులు అధైర్యపడవద్దని రైతులకు బిజెపి ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్