కుప్పం మున్సిపాలిటీలోని డికేపల్లిలో మాజీ సర్పంచ్ మణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా బీపీ, షుగర్ ఎక్కువగా ఉన్నవారిని గుర్తించి వారికి ఉచితంగా మందులు అందిస్తున్నామని అన్నారు. అదే విధంగా కుప్పం ప్రాంతంలో తమలపాకు, వక్క, పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వలన నోటి సమస్యలు అధికంగా ఉన్నాయని గుర్తించడం జరిగిందని, నోటి సమస్యలతో బాధపడుతున్న వారికి త్వరలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ మధు స్పష్టం చేశారు. వైద్య శిబిరంలో 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం…
142
previous post