మహిళా సాధికారత కోసం ఎల్లప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుందని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ ను కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం లో భాగంగా కుప్పం పర్యటనకి వచ్చినపుడు మహిళలు చాలా మంది తమకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం కావాలని కోరారు. ఉచిత శిక్షణ కేంద్రం కుప్పంలో ఏర్పాటు చేస్తామని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ని కట్టుబడి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు. మహిళా సాధికారత కోసం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎల్లప్పుడు ముందుంటారని తెలిపారు. భవిషత్తులో కూడా మరిన్ని సెంటర్లు ఏర్పాటుచేసి మరింత చేయూత అందిస్తామన్నారు. ఒక్క సెంటర్లో రోజుకి యాభై మంది మహిళలకు శిక్షణ ఇస్తామని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tag:
NTR Trust
కుప్పం మున్సిపాలిటీలోని డికేపల్లిలో మాజీ సర్పంచ్ మణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నేతృత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా బీపీ, షుగర్ ఎక్కువగా ఉన్నవారిని గుర్తించి వారికి ఉచితంగా మందులు అందిస్తున్నామని అన్నారు. అదే విధంగా కుప్పం ప్రాంతంలో తమలపాకు, వక్క, పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వలన నోటి సమస్యలు అధికంగా ఉన్నాయని గుర్తించడం జరిగిందని, నోటి సమస్యలతో బాధపడుతున్న వారికి త్వరలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ మధు స్పష్టం చేశారు. వైద్య శిబిరంలో 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.





Total views : 78021