69
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గద్వాల విజయలక్ష్మి 11 ఫిబ్రవరి 2021న జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌కు ఆమె ఐదో మహిళా మేయర్ కాగా తెలంగాణ వచ్చాక తొలి మహిళా మేయర్. ఆమె బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకురాలు. అమెరికన్ సిటిజన్‌షిప్ కలిగిన విజయలక్ష్మి అక్కడి నుంచి వచ్చి రాజకీయాల్లో చేరారు.