72
అన్నమయ్య జిల్లా రాజంపేటలో జనసేన పార్టీ నేత యల్లటూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో తోట కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి, వీరపల్లి, ఒంటిమిట్ట, సిద్దవట్టం, రాజంపేట, నందలూరు మండలాల నుంచి పెద్దఎత్తున జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ఈ సభలో కార్యకర్తల బహిరంగ అభిప్రాయాల సేకరణ నిర్వహించారు. వారు యల్లటూరి శ్రీనివాసరాజు తెలుగుదేశం వెంట నడవాలని, భారీ మెజారిటీతో గెలిపించు కోవాలని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం రాజంపేట అభివృద్ధికి జనసేన, టీడీపీ కలిసి కృషి చేస్తాయని హామీ ఇచ్చారు. జనసేన టిక్కెట్ రాలేదని తిరుగుబాటు చేయకుండా, సంస్కారవంతంగా సహకరించిన విద్యావంతుడు యల్లటూరి శ్రీనివాసరాజును సుగవాసి కొనియాడారు.