పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్నివివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) కుటుంబం ఆర్థిక దోపిడీ చేసింది..
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) కుటుంబం రాజకీయంగా, సామాజికంగా ఆర్థిక దోపిడీకి గురిచేసిందని బిజెపి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ (Gomasa Srinivas) తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని స్థానికేతరులు వివేక్ వెంకటస్వామి కుటుంబం ఇక్కడ అనేక సంవత్సరాల నేతలుగా గెలిచినప్పటికి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు ఆర్థిక వనరులను దోపిడీ చేసి, తన కుమారులైన వివేక్, వినోద్ లకు రాజకీయ ప్రవేశం చేయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆరోపించారు.
అభివృద్ధి ఫలాలను దోచుకొని పారిశ్రామికవేత్తగా ఎదిగిన వివేక్..
ఇక్కడి అభివృద్ధి ఫలాలను దోచుకొని పారిశ్రామికవేత్తగా ఎదిగిన వివేక్ ఈ ప్రాంతంలో ఒక్క ఇండస్ట్రీ ని కూడా నెలకొల్పలేదని, ఇతర ప్రాంతాలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని అన్నారు. ఇక్కడి వనరులను దోపిడీకి గురి చేశారని ఆరోపించారు. వివేక్ కుటుంబాన్ని ఈ ప్రాంత ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వివేక్ వెంకటస్వామికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. స్థానికుడైన నేను బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నరేంద్ర మోదీ సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తానని, ప్రజలు నాకు ఈసారి అవకాశం ఇవ్వాలన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి