ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఇడుపూరు గ్రామానికి చెందిన దళిత మహిళ కొండ్రు నాగమ్మకు న్యాయం చేయాలని కోరుతూ దళిత సంఘ నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు నాగయ్య మాట్లాడుతూ మార్కాపురం మండలం ఇడుపూరు గ్రామంలో దళిత మహిళ కొండ్రు నాగమ్మ భర్త చనిపోవడంతో జీవనాధారమైన పూర్వీకుల కాలం నాటి మూడెకరాల 88 సెంట్ల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుందని అన్నారు. రెండు సంవత్సరాల క్రితం తన ఆరోగ్యం బాగాలేక ఆ పొలాన్ని ఖాళీగా ఉంచారని ఇదే క్రమంలో ఇడుపూరు గ్రామానికి చెందిన వల్ల రాజు యాదవ్ తన భూమిని ఆక్రమించుకోక అడిగిన మహిళపై దాడి కూడా చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం పొలంలో పంట వేసుకుంటే ఆక్రమించిన వ్యక్తి దున్నివేయడంతో దళిత మహిళకు 60 వేల రూపాయలు నష్టం కూడా వాటిల్లిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నారు. దళిత ఎస్సి అసైన్మెంట్ భూముల కబ్జాదారులకు మద్దతుగా నిలిచిన మార్కాపురం ఎమ్మార్వో మంజునాథరెడ్డి, వీఆర్వో బడే సాహెబ్, వీఆర్ఏ నాసర్ లపై చట్ట ప్రకారం విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో బాధితురాలు కొండ్రు నాగమ్మ, దళిత సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కబ్జాదారులకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగులు…
223
previous post