అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ ఆదేశాల మేరకు చేపట్టిన అంగన్వాడీల నిరవధిక సమ్మె నేటికి 11 వ రోజు చేరుకొంది. అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఒక్కొక రోజు ఒక్కొక నిరసన కార్యక్రమం తో అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్ లు సమ్మెను ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు విద్యుత్ కార్యాలయం నుండి చెక్ పోస్ట్ సర్కిల్ వరకు గ్లాస్ తో ప్లేట్ ను కొడుతూ బిచ్చగాళ్ళలా వినూత్న రీతిలో రాస్తారోకు నిర్వహించి నిరసనను తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 11 రోజులు గా అంగన్వాడీ మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నప్పటికి ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటనలు మాత్రం రావడం లేదన్నారు. కేవలం వయోపరిమితి పెంచడం వల్ల వారి జీవన శైలిలో ఎటువంటి మార్పులు రావని పెరిగిన ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం పెంచే విధంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని అన్నారు. శిశు సంక్షేమ శాఖ మంత్రి కి మా డిమాండ్ల పరిష్కారానికి నోటిసులు అందజేసి చర్చలకు రమ్మంటే వారు ఏ మాత్రం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్న మంత్రి తీరును మార్చుకోవాలన్నారు. గతంలోనున్న జివోలను తెరపైకి తీసుకు వచ్చి అంగన్వాడీలను మభ్య పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. మేము సమ్మెలు చేస్తున్న సమయంలో మా సమస్యలను పరిష్కరించకుండా సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ వారిని కేంద్రాల అంగన్వాడీ తాళాలు పగలగొట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామంజులు, సిఐటియు అంగన్వాడి ప్రాజెక్టు కోశాధికారి భాగ్యలక్ష్మి, కె.వి డిఎస్ జిల్లా అధ్యక్షుడు డిసి వెంకటయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహులు, సిద్ధమ్మ, అంగన్వాడీ హెల్పర్స్ మరియు లీడర్స్ తదితరులు పాల్గొన్నారు.
దిగిరాని ప్రభుత్వం…కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె
74
previous post