అన్నమయ్య జిల్లా, సివిఆర్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన పలువురు నేతలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోనీ పలువురు ప్రముఖులు తమ కార్యాలయాలలో 2024 సివిఅర్ న్యూస్ ఛానెల్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించి సివిఆర్ న్యూస్ వీక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుంటూ, నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తూ ప్రజల ఆధారభిమానాలు పొందుతూ ఇలాగే కొనసాగాలి అన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో విరజిల్లాలని వారు ఆకాంక్షించారు. ఆవిష్కరించిన ప్రముఖులు టిటిడి పాలక మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు, వైసిపి విభాగం మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, వైకాపా సీనియర్ నాయకులు,మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, ప్రతిభా జూనియర్ కళాశాల కరస్పాండెంట్ అరమాటి శివగంగి రెడ్డి,తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు బోనమాల ఖాదర్ వలీ, అన్నమయ్య కన్స్ట్రక్షన్ అరమాటి జంగం రెడ్డి.
Rayachoti
అన్నమయ్య జిల్లా రాయచోట, తెదేపా తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే ద్వారక నాథ్ రెడ్డి. వైసీపీ రాజ్యసభ సభ్యుడి స్వయానా బావమరిది ద్వారక నాథ్ రెడ్డి. ఆయన తండ్రి అయినా రామ సుబ్బారెడ్డి 1978 కాంగ్రెస్ పార్టీ తరపున లక్కిరెడ్డీ పల్లి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ద్వారక నాథ్ రెడ్డి 1994 లో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో తెదేపా తరపున టికెట్ ఇవ్వకపోవడంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2009 లో టికెట్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014 వైసీపీ తరపున టికెట్ ఆశించారు. 2019 లో వైసీపీ, తేదేపా టికెట్ ఆశించినప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ద్వారకా నాథ్ రెడ్డి. గత కొన్ని రోజులుగా తెదేపా టికెట్ ఆశిస్తూ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నారు. ఈ రోజు విజయవాడ కేంద్రంగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరగనున్న భారీ బహిరంగ సభలో తారకరత్న అత్త ,అలేఖ్య రెడ్డి అమ్మ,ద్వారక నాథ్ రెడ్డి అక్క హరమ్మ సమక్షంలో పసుపు కండువా వేసుకొనున్నట్లు ఆయన అనుచరవర్గం వెల్లడించారు.
అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ ఆదేశాల మేరకు చేపట్టిన అంగన్వాడీల నిరవధిక సమ్మె నేటికి 11 వ రోజు చేరుకొంది. అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఒక్కొక రోజు ఒక్కొక నిరసన కార్యక్రమం తో అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్ లు సమ్మెను ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు విద్యుత్ కార్యాలయం నుండి చెక్ పోస్ట్ సర్కిల్ వరకు గ్లాస్ తో ప్లేట్ ను కొడుతూ బిచ్చగాళ్ళలా వినూత్న రీతిలో రాస్తారోకు నిర్వహించి నిరసనను తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 11 రోజులు గా అంగన్వాడీ మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నప్పటికి ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటనలు మాత్రం రావడం లేదన్నారు. కేవలం వయోపరిమితి పెంచడం వల్ల వారి జీవన శైలిలో ఎటువంటి మార్పులు రావని పెరిగిన ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం పెంచే విధంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని అన్నారు. శిశు సంక్షేమ శాఖ మంత్రి కి మా డిమాండ్ల పరిష్కారానికి నోటిసులు అందజేసి చర్చలకు రమ్మంటే వారు ఏ మాత్రం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్న మంత్రి తీరును మార్చుకోవాలన్నారు. గతంలోనున్న జివోలను తెరపైకి తీసుకు వచ్చి అంగన్వాడీలను మభ్య పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. మేము సమ్మెలు చేస్తున్న సమయంలో మా సమస్యలను పరిష్కరించకుండా సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ వారిని కేంద్రాల అంగన్వాడీ తాళాలు పగలగొట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామంజులు, సిఐటియు అంగన్వాడి ప్రాజెక్టు కోశాధికారి భాగ్యలక్ష్మి, కె.వి డిఎస్ జిల్లా అధ్యక్షుడు డిసి వెంకటయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహులు, సిద్ధమ్మ, అంగన్వాడీ హెల్పర్స్ మరియు లీడర్స్ తదితరులు పాల్గొన్నారు.





Total views : 78740