త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు..!

panchayat elections

Advertisements

&NewLine;<p>తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది&period; సర్పంచుల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 31à°¨ ముగియనుంది&period; దీంతో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహించే అవకాశాలున్నాయి&period; ఇందుకు సంబంధించి సర్పంచులు&comma; వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలతో జిల్లాల వారీగా రిపోర్ట్ సిద్ధం చేయాలంటూ కలెక్టర్లకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి&period; రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం&period;అశోక్‌ కుమార్‌ ఈ మేరకు లేఖ పంపించారు&period; డిసెంబర్ 30లోపు కసరత్తు పూర్తిచేసి వివరాలు అందించాలని కోరారు&period; ఓటర్ల సంఖ్యను బట్టి గ్రామాల్లో పోలింగ్‌ స్టేషన్ల ఎంపిక&comma; పోలింగ్‌ సిబ్బంది&period; రాండమైజేషన్‌ సిస్టమ్‌ సాప్ట్‌వేర్‌ అప్లికేషన్‌లో వివరాల నమోదు చేయడం వంటి వాటిపై కలెక్టర్లకు కీలకమైన సూచనలు చేశారు&period; సర్పంచ్&comma; వార్డ్ మెంబర్ల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను గ్రామ కార్యదర్శులు ఎన్నికల సంఘానికి పంపించారు&period; తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయితీలు&comma; లక్షా 13 వేలకు పైగా వార్డులు ఉన్నాయి&period; అయితే ఇవి ముందస్తు ఏర్పాట్లు మాత్రమేనని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు&period; ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనేది నూతనంగా ఏర్పడబోయే గవర్నమెంట్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు&period; కాగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే తెలంగాణ ఎన్నికల కసరత్తు మొదలవ్వడం గమనార్హం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…