89
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారితోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు, ముఖ్య నాయకులు, జన సైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.