తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రూప్ పరీక్షలకు సిద్ధం అవుతున్న పేద, బడుగు, బలహీన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపయోగపడేలా సామాజిక మాద్యమాల ద్వారా ఉచిత మెంటల్ ఎబిలిటీ స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు టీడీపీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా ప్రతి రోజు కొత్త తరహా ప్రశ్నలతో విద్యార్థి అరచేతిలో గ్రూప్స్ మెటీరియల్ ని అందుబాటులో ఉంచుతామన్నారు. నేటి నుండి పరీక్షలు పూర్తి అయ్యే వరకు ప్రతిరోజు యాభై సమాధానాలతో కూడిన ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ప్రచురితం అవుతుందన్నారు. ఈ ప్రశ్న ప్రతాన్ని అపార అనుభవం కలిగిన నిష్ణాతులైన వారిచె తయారు చేయడం జరుగుతుందన్నారు. మెటీరియల్ కొనలేని పేద విద్యార్థులకు ఇది కొంత వరకు ఉపయోగపడెలా నా వంతు ఓ ప్రయత్నం చేస్తున్నానన్నారు. రాబోవు రోజుల్లో నిరుద్యోగ యువతీ యువకులతో పాటు ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడేలా ఇలాంటి ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులకు ఎల్లవేళలా అండగా నిలుస్తామన్నారు. ఈ అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని వారు ఆకాక్షించారు.
అరచేతిలో గ్రూప్ మెటీరియల్…
91
previous post