ఇంటర్నెట్ యూజర్లతో పాటు పలు దేశాల ప్రభుత్వాలకు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 2600 కోట్ల మంది డేటా తస్కరణకు గురైందని డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థల రీసెర్చర్లు వెల్లడించినట్లు ఫోర్బ్స్ కథనం తెలిపింది. ఇలా సైబర్ మోసగాళ్లు సేకరించిన డేటా అంతా ‘మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్’ అనే సెక్యూర్ పేజీలో ఉందని చెప్పారు. చైనా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెన్సెంట్, వైబో, అడోబ్, కాన్వా, లింక్డ్ ఇన్, ఎక్స్ డాట్ కామ్, టెలిగ్రామ్‌తోపాటు ట్విట్టర్, డ్రాప్ బాక్స్ వంటి వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ యూజర్ల నుంచి ఈ డేటాను సైబర్ మోసగాళ్లు తస్కరించారని డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థల పరిశోధకులు తెలిపారు. ఈ డేటా బేస్‌ను ఒక డేటా బ్రోకర్ గానీ, ఒక సైబర్ ఫ్రాడ్‌స్టర్ గానీ కంపైల్ చేసి ఉంటారని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రూప్ పరీక్షలకు సిద్ధం అవుతున్న పేద, బడుగు, బలహీన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపయోగపడేలా సామాజిక మాద్యమాల ద్వారా ఉచిత మెంటల్ ఎబిలిటీ స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు టీడీపీ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా ప్రతి రోజు కొత్త తరహా ప్రశ్నలతో విద్యార్థి అరచేతిలో గ్రూప్స్ మెటీరియల్ ని అందుబాటులో ఉంచుతామన్నారు. నేటి నుండి పరీక్షలు పూర్తి అయ్యే వరకు ప్రతిరోజు యాభై సమాధానాలతో కూడిన ప్రశ్నలతో ప్రశ్నాపత్రం ప్రచురితం అవుతుందన్నారు. ఈ ప్రశ్న ప్రతాన్ని అపార అనుభవం కలిగిన నిష్ణాతులైన వారిచె తయారు చేయడం జరుగుతుందన్నారు. మెటీరియల్ కొనలేని పేద విద్యార్థులకు ఇది కొంత వరకు ఉపయోగపడెలా నా వంతు ఓ ప్రయత్నం చేస్తున్నానన్నారు. రాబోవు రోజుల్లో నిరుద్యోగ యువతీ యువకులతో పాటు ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడేలా ఇలాంటి ఒక కొత్త కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులకు ఎల్లవేళలా అండగా నిలుస్తామన్నారు. ఈ అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని వారు ఆకాక్షించారు.
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అధికార పార్టీని వీడుతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానంటూ తన ట్వీట్ లో వెల్లడించారు. కొంతకాలంగా జగన్ పాలనపై అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. గతేడాది డిసెంబర్ 28న ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే, రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు రాయుడు తన తాజా ట్వీట్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.
ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి, ఎలన్ మస్క్ ప్లాట్‌ఫారమ్‌పై వివాదాస్పద వ్యక్తులను తిరిగి తీసుకురావడానికి తన ఉద్దేశాన్ని స్పష్టంగా చేశారు. 2023 డిసెంబర్లో, ట్విట్టర్ 2018లో నిషేధించిన కుట్ర సిద్ధాంతకర్త అలెక్స్ జోన్స్‌ను తిరిగి తీసుకురావడం గురించి ఆయన ప్రకటన చేశారు.
మస్క్ యొక్క ప్రకటన యొక్క నేపథ్యం:
- 2018లో, ట్విట్టర్ జోన్స్‌ను నిషేధించింది, ట్విట్టర్ నియమాలను ఉల్లంఘించినట్లు ఆరోపించింది.
- జోన్స్ తన షో ఇన్ఫోవార్స్‌లో 2012 సాండీ హుక్ ఎలిమెంటరీ స్కూల్ షూటింగ్లో చనిపోయిన పిల్లలను “క్రైసిస్ నటులు” అని పిలిచాడు.
మస్క్ యొక్క ప్రకటన:
- 2023 డిసెంబర్లో, మస్క్ ట్విట్టర్లో ఒక ప్రకటన చేశారు, అందులో “సాధారణంగా, ఈ ప్లాట్‌ఫారమ్ ప్రపంచ పట్టణం కావాలని ఆశించినప్పటికీ, శాశ్వత నిషేధాలు చాలా అరుదుగా ఉండాలి.”
- అతను “విల్ కన్సిడర్” అని కూడా చెప్పాడు, అంటే అతను జోన్స్ ట్విట్టర్‌కు తిరిగి రావడానికి అనుమతి ఇవ్వడానికి తెరిచి ఉన్నాడు.
ఈ ప్రకటనకు ప్రతిచర్య:
- మస్క్ యొక్క ప్రకటన విమర్శలకు గురైంది.
- చాలా మంది జోన్స్‌ను ట్విట్టర్‌కు తిరిగి రావడానికి అనుమతి ఇవ్వడం ప్రమాదకరమైనది మరియు తప్పు అని భావించారు.
- ఇతరులు మస్క్ యొక్క నిర్ణయాన్ని సమర్థించారు మరియు ట్విట్టర్లో అన్ని వాయిస్‌లకు స్థానం ఉండాలని వాదించారు.
ప్రస్తుత స్థితి:
- ప్రస్తుతం, జోన్స్ ట్విట్టర్‌కు తిరిగి రావాల్సి ఉంది.
- మస్క్ తన నిర్ణయాన్ని ఎప్పుడు తీసుకుంటాడో స్పష్టంగా తెలియదు.
ముగింపు:
- మస్క్ యొక్క ప్రకటన ట్విట్టర్లో వివాదాస్పద వ్యక్తులపై విస్తృతమైన చర్చకు దారితీసింది.
- ఈ విషయంపై చర్చ కొనసాగుతుంది.
ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ డేటా, సేఫ్టీ కోసం పాస్వర్డ్స్ వాడుతుంటారు. అయితే వీక్ పాస్వర్డ్స్ వాడే వారు చాలా మందే ఉన్నారు. వీటిని ఒక్క సెకనులోపే హ్యాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. వీక్ పాస్వర్డ్స్ జాబితాలో మీరు కూడా ఉన్నారేమో ఇప్పుడే చూసెయ్యండి. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతిదీ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. గుండుసూది నుంచి గుమ్మడికాయ దాకా ఏది కావాలన్నా ఒక క్లిక్‌తో ఆన్‌టైమ్‌లో మన కళ్ల ముందు వచ్చి వాలిపోతుంది. టెక్నాలజీలో గణనీయమైన మార్పులు రావడంతో ప్రతి ఒక్కరూ మనీ ట్రాన్సాక్షన్స్ ఇతర వ్యవహారాలను ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ నుంచే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఫోన్లకు పాస్వర్డ్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇవి ఫోన్ డేటాతో పాటు ఇతర వివరాలను సురక్షితంగా ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే కొందరు ఆ పాస్వర్డ్స్ సరైన జాగ్రత్తలు తీసుకుంటుండగా.. కొందరికీ వాటి గురించి ఇప్పటికీ తెలియదు. దీంతో వీక్ పాస్వర్డ్స్ వాడుతున్నారు. ఇలా 2023లో ప్రజలు ప్రధానంగా ఎలాంటి పాస్వర్డ్స్ వాడుతున్నారనే దానిపై నార్డ్‌పాస్ ఒక నివేదికను ప్రచురించింది. ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ రంగంలోనే కాకుండా Google, Facebook, Twitter, Instagram వంటి అకౌంట్లలో వ్యక్తిగత డేటాను చోరీ చేసేందుకు సైబర్ ముఠాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వీరు చోరీ చేయాలంటే ముందుగా మన అకౌంట్, పాస్వర్స్ గురించి తెలియాలి. కాబట్టి మనం ఎక్కువగా ఎలాంటి పాస్వర్డ్స్ పెడతామో తెలుసుకుని వాటి నుంచి డేటా తస్కరించేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మనం బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. పైన చెప్పిన జాబితాలో మీ పాస్వర్డ్ ఉంటే దాదాపు ఒక సెకనులోపే హ్యాక్ చేయొచ్చు. హ్యాకర్లకు ఒక పాస్వర్డ్ హ్యాక్ చేసేందుకు 17 నిమిషాల సమయం పడుతుంది. ఈ సందర్భంలో స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. మీరు లాగిన్ చేస్తున్న యాప్ లేదా వెబ్‌సైట్‌కి కనీసం 8 అక్షరాల నిబంధన ఉంటే, అందులో ఇంగ్లీష్ స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్, నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లు ఉండేలా క్రియేట్ చేయండి. లేదంటే క్లిష్టంగా ఉండి. మీరు గుర్తుంచుకునే పాస్‌వర్డ్స్‌ను రూపొందించండి. కేవలం నెంబర్లు, పదాలతో కూడిన సాధారణ పాస్వర్డ్ ఎప్పటికీ రూపొందించకండి.
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. వై ఏపీ హేట్స్ జగన్ అంటూ ఓ పోస్టర్ ను మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. అందులో రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో జగన్ ఘన కార్యాలకు ఈ ఒక్క చిత్రం సరిపోతుందన్నారు. ప్రజలు ఏపీ హేట్స్ జగన్, వద్దు.. వద్దు.. ఈ జగన్, మళ్లీ మాకొద్దు ఈ జగన్ అని ఎందుకంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఏపీకి జగనే ఎందుకు కావాలని ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సెటైరికల్ గా గంటా శ్రీనివాసరావు ఈ పోస్టర్ ను ట్విటర్ లో షేర్ చేశారు.
రికార్డు స్థాయిలో ఏకంగా 44 బిలియన్ డాలర్లు వెచ్చించి ఏడాది క్రితం కొనుగోలు చేసిన ట్విట్టర్ (ప్రస్తుతం ‘ఎక్స్’) ద్వారా అదనపు ఆదాయాన్ని పొందాలని అధినేత ఎలాన్ మస్క్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఎక్స్ యాప్‌పై ప్రత్యేకంగా డేటింగ్ ఫీచర్ జోడించాలని ఆయన భావిస్తున్నట్టు కంపెనీ అంతర్గతవర్గాలు పేర్కొన్నాయి. అయితే ఒకే సైట్‌పై డేటింగ్ ఫీచర్‌ను ఎలా అందుబాటులోకి తీసుకొస్తారనే వివరాలు తెలియరాలేదు. ట్విట్టర్ వార్షికోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన వీడియో కాల్లో ఎలాన్ మస్క్ తన ప్రణాళికలను వెల్లడించినట్టు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. 2024 నాటికల్లా ఈ డేటింగ్ ఫీచర్‌ని తీసుకురావొచ్చని తెలుస్తోంది. డేటింగ్ ఫీచర్‌తోపాటు ‘ఎక్స్’పై డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్ తీసుకురావాలని మస్క్ భావిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ‘ఎక్స్’ను ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చాలని భావిస్తున్నట్లు గతంలో ఓ సందర్భంలో పేర్కొన్న విషయం తెలిసిందే. మరిన్ని కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడమే ఆయన లక్ష్యంగా ఉంది. కాగా ట్విట్టర్ ను ఏడాదిక్రితం ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అక్టోబర్ 2022లో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. జులైలో ‘ఎక్స్’గా రీబ్రాండ్ చేశారు. ఉద్యోగుల తొలగింపు, వినియోగదారుల అకౌంట్ల తొలగింపు, ఆ తర్వాత పునరుద్ధరణ, బ్లూ టిక్కి ఫీజు వంటి చర్యలు వార్తల్లో నిలిచాయి. తద్వారా ఎక్స్‌కు ప్రకటనదారులు దూరంగా జరిగారు. మొత్తంగా ఈ ప్లాట్‌ఫామ్ విలువ సగానికి సగం దిగజారింది. ట్విట్టర్ బ్రాండ్ తొలగింపు ద్వారా దీని విలువ 20 బిలియన్ డాలర్ల మేర క్షీణించిందని ఫోర్బ్స్ రిపోర్ట్ అంచనా వేసింది. డబ్బు చెల్లించి వాడుకోగలిగే కస్టమర్లను మాత్రమే కలిగివుందన్న కారణాన్ని ప్రస్తావించింది. కాగా యూజర్లు ఏం కోరుకుంటున్నారో ఆ విషయం అధినేత మస్క్‌కి అర్థంకావడంలేదని కంపెనీకి చెందిన ఒకరు వాపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.