పల్నాడు జిల్లా.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (Bolla Brahmanaidu) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టిడిపి జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu). టిడిపి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ…. అసభ్యకరమైనటువంటి పదాలను ఉపయోగించిన ఎమ్మెల్యే బొల్లా పై ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ బూతు పురాణం పిల్లలు మహిళలు వినలేకపోతున్నారని సభ్యత నేర్చుకోవాలని హితావు చేశారు.
వినుకొండ పట్టణంలోని త్రాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారానికై నిధులు తీసుకువస్తే దానిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దుర్యోగం చేశారని దీనిపైన మేము ప్రశ్నించినందుకు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రశ్నించినందుకు దానికి సమాధానం చెప్పుకోలేక ఇలా ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాలపై ఎమ్మెల్యే బొల్లా చేసినటువంటి పదజాలాన్ని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే బొల్లా ఓటమి భయంతోనే అసహనానికి గురై ఇలాంటి అసహ్య పదజాలను ఉపయోగిస్తున్నారని జీవి ఆంజనేయులు ఆరోపణ చేశారు.
ఇది చదవండి: స్టేషన్ లోనే పంచాయితీలు షూరు..
Follow us on : Google News మరిన్నితాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి