వేసవి కాలం(Summer Season)లో కొన్ని రకాల జాగ్రత్తలు..
వేసవి కాలంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవి ప్రతాపం నుంచి మన చర్మాన్ని కాపాడుకోవడానికి వీలుంటుంది. ముఖ్యంగా ఎండాకాలం శరీరాన్ని డీహైడ్రేట్(Dehydrate) కాకుండా చూసుకోవాలి. తగినన్ని మంచినీళ్లు తాగాలి. ఎండాకాలం తగినన్ని మంచినీళ్లు తాగడంవల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఎండలలో బయటకు వెళ్లాల్సి వస్తే తప్పకుండా సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగించండి. సూర్యుని తీవ్రమైన కిరణాల నుండి సన్ స్క్రీన్ లోషన్స్ చర్మాన్ని కాపాడతాయి. ఒకవేళ పని మీద బయటకు వెళ్ళవలసి వస్తే ఒక గొడుగు తీసుకు వెళ్లడం ఉత్తమం. దీని ద్వారా ఎండ బారి నుంచి మన చర్మాన్ని రక్షించుకునే వాళ్ళం అవుతాం.
ఇది చదవండి: పిస్తా పప్పు తో ఎన్ని లాభాలో తెలుసా? మగవాళ్ళు అస్సలు మిస్స్ కావొద్దు
ఎండల కాలంలో నల్లని వస్త్రాలు కాక తెల్లని వస్త్రాలు ధరించటం వలన కూడా మన చర్మాన్ని ఎండ తీవ్రత నుండి రక్షణ లభిస్తుంది. ఇక ఎండాకాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొబ్బరి నీళ్లు , పళ్ళ రసాల వంటివి తాగాలి. టమాటో, కీరా దోసకాయ, బొప్పాయి వంటివి తినటంతో పాటు కుదిరినప్పుడు వీటితో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఎండాకాలంలో ముఖం నిగారింపును సొంతం చేసుకోవడానికి ముఖానికి సరిపోయే విధంగా పండ్లతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను వేసుకుంటే మంచిది. ఇక అప్పుడప్పుడు ఎండకు చర్మం నల్లబడితే ట్యాన్ పోయే విధంగా సహజ సిద్ధమైన ప్యాక్ లు వేసుకోవాలి. ఇంట్లో కూడా స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ వాడడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి