ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల కోసం ఏపీలో ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకువచ్చారు. దీనికోసం తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్ 2023కు ఆమోద ముద్రపడింది. గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించారు. దీనికి రాష్ట్ర గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో చట్టరూపం దాల్చింది. చట్టం అమల్లోకి వచ్చినట్టు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న సీఎం సెక్యూరిటీ వింగ్ తో పాటు అదనంగా సీఎం భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ను ఏర్పాటు చేయస్తున్నట్టు తెలిపారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ద్వారా ముఖ్యమంత్రి, భార్య / భర్త, తల్లిదండ్రులు, పిల్లలకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తారు. సీఎం నివాసం వద్ద, రోడ్డు, రైలు, వాయు, జల మార్గాల్లో ప్రయాణించేటప్పుడు, నడక సమయంలో వారికి భద్రత ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడే కాకుండా విదేశాల్లో ఉన్నప్పుడు కూడా భద్రత కల్పిస్తారు. ప్రస్తుతం జగన్ కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారు. ఈ చట్టం ప్రకారం విదేశాల్లో ఉన్న జగన్ కుమార్తెలు ఇద్దరికీ అక్కడ భద్రతను కల్పిస్తారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చును భరిస్తుంది.
సీఎం కుటుంబ సభ్యులకు భారీ భద్రత..!
69
previous post