అమలాపురంలో తీవ్ర కలకలం..

అమలాపురంలో తీవ్ర కలకలం..

Advertisements

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మైనర్ బాలిక అబార్షన్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది&period; అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చట్టవిరుద్ధంగా జరిగిన ఈ అబార్షన్ ఉదంతంపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది&period; జిల్లా కలెక్టర్ సంచలన ఆదేశాలతో&period;&period; అమలాపురం &OpenCurlyQuote;ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్’లో అధికారుల ప్రత్యేక బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది&period;ఆర్డీవో మమ్మీ&comma; డీఎంహెచ్‌వో దుర్గారావు&comma; బాల హక్కుల కమిషన్ సభ్యురాలు నాగా మానస నేతృత్వంలోని ఉన్నతాధికారుల టీమ్ ఆసుపత్రిని జల్లెడ పడుతోంది&period; మైనర్ బాలికకు అబార్షన్ చేసిన వ్యవహారంలో హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ లంకె శిరీషను అధికారులు గదిలో వేసి సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు&period; ఆసుపత్రి రికార్డులు&comma; నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీస్తున్నారు&period;మరోవైపు ఈ ఘటనపై బాల హక్కుల కమిషన్ సభ్యురాలు నాగా మానస తీవ్రంగా స్పందించారు&period; సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జనాభా పెరగాలని&comma; పిల్లలను ఎక్కువ మందిని కనాలని పిలుపునిస్తుంటే&period;&period; ఇక్కడ మైనర్లకు అక్రమంగా అబార్షన్లు చేయడం అత్యంత దారుణమన్నారు&period; చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా సరే&period;&period; చట్టం తన పని తాను చేసుకుపోతుందని&comma; కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు&period; ఈ తనిఖీల అనంతరం నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ‘నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్’గా మార్చిందన్న టీఎన్ఎస్ఎఫ్.

నటి రమా నందన కుటుంబంపై ఇబ్రహీంపట్నంలో కేసు.

వికారాబాద్ జిల్లా, యాలాల్ మండలం, కోకట్ గ్రామ సమీపంలో విషాదం.