89
ఈ నెల 28న జనసేన-టీడీపీ సభ నిర్వహిస్తోందని.. ఉమ్మడి ప్రణాళికలను సభ ద్వారా వెల్లడించబోతున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమే తమ పొత్తు అని వివరించారు. ప్రజా ధనంతో జగన్ హెలికాప్టర్లు ఎలా సమకూర్చుకుంటారని ప్రశ్నించారు. దిగిపోయే ముందు కూడా జగన్ ఖజానా ఖాళీ చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రచారం కోసం ప్రభుత్వ ధనం ఎలా వాడతారు? హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై విచారణ చేపట్టాలన్నారు. జనసేన, టీడీపీతో బీజేపీ కలవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం అవసరం అని నాదెండ్ల అన్నారు.