అద్భుతమైనటువంటి రాయచోటి ప్రజల చిరకాల కోరికనైటువంటి వంద పడకల ఆసుపత్రి నిర్మాణం దాదాపుగా పూర్తి కావడం జరిగింది. ఈ నెల 6 వ తేదిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషా పీఎస్ ఆధ్వర్యంలో ప్రారంభం జరగనున్నట్లు అన్నమయ్య జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పెండింగ్ పనులను మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష, ఆసుపత్రి అభివృద్ధి కమిటి సభ్యులు, అన్నమయ్య జిల్లా వైసిపి మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, ఆసుపత్రి సూపరిటెండెంట్ డేవిడ్ సుకుమార్, సీనియర్ వైద్యులు బండారు కిరణ్ కుమార్, మహేశ్వర రాజు, లక్ష్మి ప్రసాద్ ఇంజనీరింగ్ శాఖ డి ఈ ఈ రాజగోపాల్ రెడ్డి లతో కలిసి వారు పరిశిలించారు. ఈ సందర్బంగా 23 కోట్లతో పాటు 40 లక్షల నిధులతో అదనంగా నిర్మిస్తున్న ఐ పి హెచ్ ల్యాబ్ ను 25 లక్షల నిధులతో పూర్తి కావచ్చని ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశిలించి మిగిలిన పెండింగ్ పనులను పూర్తి చేసి రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేందుకు కృషి చేయాలన్నారు. ఆసుపత్రి నేమ్ బోర్డు, గ్రీనరి కోసం ఏర్పాట్లు, రోడ్లను వారు పరిసిలించారు. ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే పెసంట్లకు వసతులతో పాటు వైద్య సేవలు అందించి ఆయా వైద్యుల గదులను కుడా పరిశిలించి వైద్యులకు కేటాయించిన గదుల స్థితి గతులను వారిని అడిగి తెలుసుకొన్నారు. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, లిఫ్ట్, డయాలసిస్ తదితర వాటిని పరిశిలించి మిగిలిన పనులను కుడా త్వరితగతిన పూర్తీ చేసి 6వ తేదీ ప్రారంభం చేయడానికి సిద్దం చేయాలనీ గుత్తే దారులకు సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిధులుగా హాజరుకానున్న ఆంధ్రప్రదేశ్ సిఎం అదనపు కార్యదర్శి కె ధనంజయరెడ్డి ఐఎఎస్, ఎంపి మిథున్ రెడ్డి, శాసన మండలి డిప్యూటి చైర్మన్ జఖియా ఖానం హాజరు కానున్నట్లు వారు తెలిపారు. వారి వెంట కౌన్సలర్ అన్నా సలీం, ఎ 1 కాంటాక్టర్ రియాజ్ రెహ్మాన్, ఇతర వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
త్వరలో అందుబాటులోకి రానున్న వంద పడకల ఆసుపత్రి…
82
previous post