హుస్నాబాద్ నియోజకవర్గం జన్మనిచ్చింది – మంత్రి పొన్నం

minister ponnam prabhakar

Advertisements

&NewLine;<p>రాజకీయంగా తనకు మరోసారి హుస్నాబాద్ నియోజకవర్గం జన్మనిచ్చిందని&comma; నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పని చేస్తానని రాష్ట్ర రవాణా&comma; బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు&period; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టి తొలిసారి హుస్నాబాద్ కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు పార్టీ శ్రేణులు&comma; అభిమానులు ఘన స్వాగతం పలికారు&period; మంత్రి పొన్నం ను గజమాలతో సత్కరించి&comma; పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు&period; అనంతరం అంబేడ్కర్ కూడలి వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ మేరకు హుస్నాబాద్ కు మెడికల్ కాలేజీ తెచ్చే బాధ్యత తనదన్నారు&period; సెంటిమెంట్ కాదు&comma; హుస్నాబాద్ లో డెవలప్మెంట్ మొదలయిందని పేర్కొన్నారు&period; భూనిర్వాసితులను బతిమిలాడైనా నియోజకవర్గంలోని గౌరవెల్లి&comma; గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయిస్తానని వెల్లడించారు&period; హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలని&comma; ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు&period; నియోజకవర్గంలో ప్రతి ఊరికి వెళ్లి ప్రజల సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు&period;<br>హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ మార్పు తీసుకొస్తానని&comma; ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల మందరం కలిసి ఉమ్మడి జిల్లాను ఊహించని రీతిగా అభివృద్ధి చేస్తామన్నారు&period; హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికెళ్లిన గళ్ళ ఎగిరేసుకునే విధంగా పనిచేస్తానని&comma; ప్రతిరోజు ఉదయం హుస్నాబాద్ లో ఉంటే&comma; సాయంత్రం హైదరాబాద్ లో&comma; సాయంత్రం హైదరాబాద్ లో ఉంటే ఉదయం హుస్నాబాద్ లో ఉంటానన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..